చెల్లె చూస్తుండగా వివాహితపై మరిది, మిత్రుడు గ్యాంగ్ రేప్
జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. జైపూర్‌లోని కర్ని విహార్ థాన మిత్రా కాలనీలో 24 ఏళ్ల వివాహిత మహిళపై ఆమె మరిది, అతని మిత్రుడు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు సోమవారం వెల్లడించారు.
బాధితురాలిని ఆమె చెల్లెలు ఓంవతి, మరిది రాంబాబు తమ ఇంటికి తీసుకుని వెళ్లారు. ఆ ఇంట్లోనే రాంబాబు, అతని మిత్రుడు రాంప్రసాద్ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిని అరెస్టు చేశారు.

బాధితురాలి మరిది రాంబాబును, అతని మిత్రుడు రామప్రసాద్‌ను, ఓంవతిని, ఇంటి యజమాని బద్రీ బైర్వాను పోలీసులు అరెస్టు చేశారు. గదిలో బాధితురాలిపై అత్యాచారం జరుగుతుండగా ఓంవతి, బైర్వా చూశారనే ఆరోపణలు వచ్చాయి. రాంబాబు, రామప్రసాద్‌లపై ఐపిసి సెక్షన్ 376 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేశారు. ఓంవతి, బద్రీ బైర్వాలపై ఐపిసి 120బి (క్రిమినల్ కుట్ర కింద శిక్ష) రింద కేసు నమోదు చేశారు.
బాధితురాలు భర్తతో గొడవ పడి ఒంటరిగా ఉంటోంది. నగరంలో కూలీ పనులు చేసుకుంటూ బతుకుతోంది. నలుగురిపై ఆమె ఆదివారంనాడు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమెను వైద్యపరీక్షల నిమిత్తం పోలీసులు ఆస్పత్రికి పంపించారు. ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు.












Click it and Unblock the Notifications