దారుణం: భర్త ఎదుటే కారులో మహిళపై సామూహిక అత్యాచారం, ముగ్గురు యువకుల అరెస్ట్

జైపూర్: రాజస్థాన్ రాష్ట్రంలోని బార్మర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భర్త ఎదుటే ఓ వివాహితపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. భార్యాభర్తలు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, వారిని అడ్డగించి ఈ అఘాయిత్యానికి తెగబడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల్ ప్రకారం.. రాజస్థాన్ బార్మర్‌కు చెందిన దంపతులు మంగళవారం బలోత్రాకు ద్విచక్ర వాహనంపై బలయలుదేరారు. వీరిని మార్గమధ్యంలో నలుగురు దుండగులు కారులో వచ్చి అడ్డగించారు. దంపతులపై దాడి చేశారు. ఆ తర్వాత నిందితుల్లో ఒకడు బాధిత మహిళ భర్త బైక్ తీసుకుని పరారయ్యాడు.

 Woman gang-raped by 3 in front of husband in Barmer, Rajasthan

అనంతరం మిగిలిన ముగ్గురు ఆమె భర్తను తీవ్రంగా కొట్టారు. ఈ తర్వాత భార్యాభర్తలిద్దరినీ బలవంతంగా కారులో ఎక్కించారు. కారులోనే ముగ్గురు యువకులు మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులను మరో చోట వదిలేసి నిందితులు పరారయ్యారు.

బాధితురాలు తన భర్తతో కలిసి స్థానిక పోలీస్ట్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టి పట్టుకున్నారు. కామ్తబాయికి చెందిన ముగ్గురు నిందితులు చునరామ్ జాట్, బాబూలాల్ జాట్, నరేష్ జాట్‌లను పోలీసులు కటకటాలవెనక్కి నెట్టారు. బాధితురాలి భర్త బైక్‌తో పరారైన మరో నిందితుడు కిషన్ కోసం గాలింపు చేపట్టిట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా అత్యాచారానికి గురైనట్లు తేలిందని పోలీసులు వెల్లడించారు.

పట్టపగలే చైన్ స్నాచింగ్
దేశ రాజధాని ఢిల్లీ శివారు నగరమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఘజియాబాద్‌లో పట్టపగలే చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. షాహిబాద్‌లో నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళ నుంచి బంగారు గొలుసును అందరూ చూస్తుండగానే ఎత్తుకెళ్లారు. తొలుత ఓ మహిళను ఇద్దరు దొంగలు గమనించి వెంబడించారు. అదునుచూసుకుని ఒక దొంగ మహిళ మెడలోని బంగారు గొలుసును లాక్కెళ్లాడు.

అప్పటికే ద్విచక్ర వాహనంతో సిద్ధంగా ఉన్న మరో దొంగ బండి ఎక్కిపరారయ్యాడు. ఇందుకు సంబందించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఘజియాబాద్‌లో చైన్ స్నాచర్లు రెచ్చిపోతుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు దుర్మరణం
ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న ట్రక్కును కారు ఢీకొన్న ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. బస్తీ జిల్లాలో జరిగిన కారు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలతో బైటపడినప్పటికీ, మరొకరి పరిస్థితి తీవ్రంగా ఉంది. లక్నో నుంచి జార్ఖండ్‌కు వెళుతుండగా పురైనా క్రాసింగ్ వద్ద గురువారం ఈ ప్రమాదం జరిగింది.

అతి వేగంగా దూసుకొచ్చిన కారు ఆగి ఉన్న కంటైనర్ టక్కును ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైంది. ట్రక్కు కింద నుంచి కారును బయటకు తీయడానికి రెస్క్యూ అధికారులు క్రేన్‌ను ఉపయోగించాల్సి వచ్చింది. ఈ దుర్ఘటనలో కారులో ఉన్న ఏడుగురిలో ఐదుగురు ఘటనా స్థలంలోనే మరణించారు. కారు డ్రైవర్, మరో ఐదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించామనీ, అయితే బాలిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ, డ్రైవర్ అభిషేక్‌ పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారి తెలిపారు. చనిపోయిన వారిని అబ్దుల్‌ నజీజ్‌, నర్గీస్‌, ఆనం, సిజ్రా, టుబాగా గుర్తించారు. మరోవైపు ఈ విషాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం తెలిపారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+