వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే స్టేషన్‌లోనే మహిళపై గ్యాంగ్‌రేప్: నిందితులు రైల్వే ఉద్యోగులే, అరెస్ట్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం చేసిన కేసులో నలుగురు నిందితులను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఈ నలుగురు నిందితులు కూడా రైల్వే ఉద్యోగులే కావడం గమనార్హం.

30 ఏళ్ల బాధితురాలిపై గురువారం అర్థరాత్రి ఇద్దరు రైల్వే ఉద్యోగులు రైల్వే స్టేషన్‌లోని ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ స్టాఫ్ రూమ్‌లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సామూహిక అత్యాచారంపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు అరెస్టు చేశారు.

Woman gang-raped by railway employees at New Delhi station, 4 arrested

గురువారం రాత్రి 8-9 రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌లోని ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ సిబ్బంది గదిలో 30 ఏళ్ల బాధితురాలు అత్యాచారానికి గురైంది. ఎలక్ట్రికల్ డిపార్ట్‌మెంట్‌లోని రైల్వే ఉద్యోగులైన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు డీసీపీ రైల్వే హరేంద్ర సింగ్ తెలిపారు.

"జూలై 22న తెల్లవారుజామున 3.27 గంటలకు మాకు కాల్ వచ్చింది, అందులో రైల్వే స్టేషన్‌లోని గదిలో ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారం చేశారని మహిళ ఆరోపించింది. విచారణలో, రైలు లైటింగ్ గదిలో ఈ సంఘటన జరిగినట్లు మేము కనుగొన్నాము అని సదరు అధికారి తెలిపారు.

రైల్వే ఉద్యోగులైన నలుగురు నిందితుల వివరాలు.. సతీష్ కుమార్ (35), వినోద్ కుమార్ (38), మంగళ్ చంద్ మీనా (33), జగదీష్ చంద్ (37). ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, రెండు గంటల్లో అరెస్టు చేసి, ఢిల్లీ కోర్టు ముందు హాజరుపరిచారు అధికారులు. నిందితులకు 14 రోజుల జూడీషియల్ రిమాండ్ విధించింది కోర్టు.

English summary
Woman gang-raped by railway employees at New Delhi station, 4 arrested.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X