రైల్లో స్నేహం చేసి, ట్రక్ పార్కింగ్ వద్ద మహిళపై గ్యాంగ్ రేప్
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబై మహానగరంలో మంగళవారం రాత్రి 21 ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ముగ్గురు వ్యక్తులను కూడా పోలీసులు సంఘటనా స్థలంలోనే అరెస్టు చేశారు. బాధితురాలు ఇంటికి తిరిగి వెళ్లడానికి రేయ్ రోడ్డు రైల్వే స్టేషన్‌లో నిరీక్షిస్తుండగా నిందితులు ఆమెతో పరిచయం పెంచుకున్నారు.
ఇంటి వద్ద భద్రంగా దించుతామని ముగ్గురు వ్యక్తులు కూడా ఆమెతో నమ్మబలికారు. దాంతో కాటన్ గ్రీన్ స్టేషన్‌కు నలుగురు కలిసి లోకల్ రైలు ఎక్కారు. కాటన్ గ్రీన్ స్టేషన్ వద్దకు చేరుకున్న తర్వాత ఆ ముగ్గురు వ్యక్తులు మహిళను బెదిరించి, సమీపంలోని ట్రక్ పార్కింగ్ వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడ ఆమెపై అత్యాచారం చేశారు.

గస్తీ తిరుగుతున్న పోలీసులు బాధితురాలి కేకలు విని అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఆ ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. నిందితులు గోల్డ్‌స్మిత్ వర్క్‌షాపులో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాధితురాలు మురికివాడలో నివసిస్తోంది.
ప్రధాన నిందితుడిని సలీం షేక్‌గా గుర్తించారు. బాధితురాలపై అత్యాచారం జరిగినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. నిందితులు పాత నేరస్థులు కారు. వారిపై ఏ విధమైన క్రిమినల్ రికార్డులు లేవు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications