ఒప్పుకోలు: భర్త, అత్త ఎదుట స్త్రీపై గ్యాంగ్ రేప్, దోపిడీ

కుటుంబ సభ్యులను కట్టేసి, కత్తులతో బెదిరించి మహిళపై అత్యాచారం జరిపారని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ఇన్‌స్పెక్టర్ రఘ్వీందర్ చెప్పారు. 21 ఏళ్ల వయస్సు ఉన్న నలుగురు నిందితులు తాము పోలీసులమని చెప్పా, మత్తు పదార్థాల అక్రమ విక్రయాలపై విచారణ జరుపుతున్నామని చెప్పి ఇంట్లోకి ప్రవేశించారు
నలుగురు నిందితులను కూడా పోలీసులు చిక్కబల్లాపూర్‌లో అక్టోబర్ 31వ తేదీన పోలీసులు అరెస్టు చేసినట్లు, వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు అదనపు పోలీసు కమిషనర్ (శాంతిభద్రతలు) అలోక్ కుమార్ చెప్పారు.
సంఘటన అక్టోబర్ 24వ తేదీన జరిగింది. నిందితులపై అక్టోబర్ 28వ తేదీన తమకు ఫిర్యాదు చేసినట్లు రఘ్వీందర్ చెప్పారు. తలుపులు తెరవగానే పదునైన ఆయుధంతో దోపిడీదారులు భర్తను బెదిరించి ఇంట్లోకి చొరబడ్డారని ఫిర్యాదులో చెప్పారు. అల్మరాను పగులగొట్టి నగదు, ఇతర విలువైన వస్తువులను దొంగలించారని చెప్పారు.
ఆ తర్వాత భర్తను, అత్తను పడకకు కట్టేసి వారి ఎదుటే మహిళపై ఇద్దరు నిందితులు అత్యాచారం చేశారు. మరో ఇద్దరు బయట కాపలాగా ఉన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు కుటుంబ సభ్యులను బెదిరించారు. బయటి నుంచి తాళం వేసి పారిపోయారు.












Click it and Unblock the Notifications