మహిళపై ఫేస్‌బుక్ ఫ్రెండ్, మరో ఇద్దరు గ్యాంగ్ రేప్
చండీగడ్: హర్యానా రాష్ట్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ 21 ఏళ్ల మహిళపై ఆమె ఫేస్‌బుక్ ఫ్రెండ్, అతని మిత్రులు ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన సోమవారం జింద్‌లో చోటు చేసుకుంది.
నిందితుడు రామ్ నివాస్ అలియాస్ రాజ్ పౌజీతో పాటు అతని ఇద్దరు మిత్రులపై పోలీసులు కేసు పెట్టారు. నిరుడు ఆ మహిళ స్థానిక యువకుడిని పెళ్లాడినట్లు సమాచారం. ఆమె ఫేస్‌బుక్‌లో రాజ్ ఫౌజీతో సంబంధాల్లోకి వచ్చింది. ఇరువురు తమ నెంబర్లను ఇచ్చిపుచ్చుకున్నారు.

తనను హిందీ సినిమాకు తీసుకుని వెళ్తానని రాజ్ ఫౌజీ చెప్పాడని, అయితే తనను బీబీపూర్ ఫామ్‌హౌస్‌కు తీసుకుని వెళ్లి మరో ఇద్దరితో పాటు తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ మహిళ ఫిర్యాదు చేసింది.
మహిళ విషయాన్ని తన భర్తకు చెప్పింది. దాంతో వారిరువురు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహిళకు వైద్య పరీక్షలు చేస్తున్నట్లు, ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications