చెట్టుకు కట్టేసి భర్త ఎదుటే భార్యపై గ్యాంగ్‌రేప్: అరెస్ట్
ఐజ్వాల్/ముంబై: ఈశ్యాన్య రాష్ట్రమైన మిజోరాంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వివాహితపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి భర్త ఎదుటే దుండుగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు.
ఈ ఘటన రోపాయబౌక్ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు. బాధితురాలి భర్తను చెట్టుకు కట్టేసిన ఇద్దరు యువకులు, అతని ఎదుటే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులైన చావల్హుమున్ ప్రాంతానికి చెందిన జార్జోలియాన(19), పిసి లహ్రుయత్లూంగా(20)లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

మైనర్ బాలికకు వేధింపులు
ముంబై: మహారాష్ట్రలోని నేవీ ముంబైలో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. నిందితుడు భూపేశ్ భగత్(33) గత కొంత కాలంగా పాఠశాల విద్యార్థినిని(15) పెళ్లి చేసుకుంటానని వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలోనే శనివారం ఆ బాలిక పాఠశాలకు వెళుతున్న సమయంలో ఆమెను చేయిపట్టి లాగి పెళ్లి చేసుకుంటానని వేధించాడు.
అయితే ఆ బాలిక అందుకు నిరాకరించింది. ఈ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు భూపేశ్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు ఓ టెలివిజన్ ఛానల్‌లో వీడియో ఎడిటర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications