వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరీక్షా హాల్లో బిడ్డకు జన్మ: తల్లీ బిడ్డలు క్షేమం

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman gives birth in class 12 board exam hall
పాట్నా: బీహార్‌ రాష్ట్రంలో విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. 12వ తరగతి పరీక్షలు రాయడానికి వచ్చిన ఓ మహిళ పరీక్షా గదిలోనే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంఘటన బీహార్‌లోని శరన్ జిల్లాలోని ఓ కళాశాలలో గురువారం చోటు చేసుకుంది. శుక్రవారంనాడు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు.

దాదాపు 20 ఏళ్ల వయస్సు ఉన్న మహిళ గురువారం పరీక్ష రాస్తూ అసౌకర్యానికి గురైందని, పురుటి నొప్పులు పడిందని కళాశాల అధికారి ఎస్‌కె సింగ్ చెప్పారు. కళాశాలకు అంబులెన్స్ చేరుకునే లోపలే ఆమె ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిచ్చింది.

ఆ తర్వాత మహిళను ఆస్పత్రిలో చేర్చారు. సుఖ ప్రసవమే జరిగిందని, తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని, వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు చెప్పారు. 12వ తరగతి బోర్డు పరీక్షలు 882 కేంద్రాల్లో గతవారం ప్రారంభమయ్యాయి.

కళాశాలల బోధనేతర సిబ్బంది నిరవధిక సమ్మెలో ఉన్న నేపథ్యంలో గట్టి బందోబస్తు మధ్య ఈ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ ఏడాది 981,778 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. రికార్డు స్థాయిలో 410,662 మంది అమ్మాయిలు పరీక్షకు కూర్చున్నారు.

English summary
A woman in Bihar gave birth in the examination hall where she was appearing for her class 12 exams, an official said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X