నిర్బంధించి మహిళపై ముగ్గురు గ్యాంగ్ రేప్
గుర్గావ్: ముగ్గురు వ్యక్తులు 22 మహిళను ఎత్తుకెళ్లి, నిర్బంధించి, ఆమె అత్యాచారం చేశారు. ఆ ముగ్గురిపై పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఆ సంఘటన పాలం విహార్‌లోని మౌడలహేరా గ్రామంలో చోటు చేసుకుంది.
తను పెళ్లి చేసుకుంటానని చెప్పి నిందితుల్లో ఒక్కడైన కమల్ (25) తనను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫరిదాబాద్‌కు పిలిచాడని, కానీ అతని సోదరులు బబ్లూ, సోను తనను నిర్బంధించి తపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది.

కాగా, మహిళ ఫిర్యాదుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కమల్‌ను ఆమె ప్రేమించి, అతనితో పారిపోయి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భార్యను ఆమె కుటుంబ సభ్యులు ఎత్తుకెళ్లి ఇంట్లో నిర్బంధించారని కమల్ ఫరిదాబాదులోని సరాయ్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఈ వాదనను మహిళ కూడా అంగీకరిస్తోందని పోలీసులు చెప్పారు. దాంతో పోలీసులు మహిళ ఫిర్యాదును పోలీసులు జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు.












Click it and Unblock the Notifications