వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తకు డ్రగ్స్ఇస్తూ పట్టుబడిన భార్య, పిల్లలే చంపేశారు!

By Srinivas
|
Google Oneindia TeluguNews

లక్నో: ముజఫర్ నగర్‌కు చెందిన ఓ మహిళ జైలులో ఉన్న తన భర్తకు డ్రగ్స్ సరఫరా చేయబోతూ పట్టుబడింది. దీంతో, ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది.

ముజఫర్ నగర్‌కు చెందిన చాంద్‌ మియా అనే వ్యక్తి జిల్లా జైలులో ఉన్నాడు. ఆయన భార్య సైరా అతనిని చూడటానికి సోమవారం సాయంత్రం జైలుకు వచ్చింది. ఆ సమయంలో భర్తకు అందించేందుకు 50 గ్రాముల మత్తు పదార్థాన్ని వెంట తీసుకు వచ్చింది.

భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఆమె వద్ద డ్రగ్స్‌ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దాన్ని స్వాధీనం చేసుకొని ఆమెను అరెస్టు చేసినట్లు జిల్లా జైలు సూపరింటెండెంట్ రాకేష్ సింగ్ తెలిపారు. గేట్ వద్ద ఆమెను తనిఖీ చేస్తే అవి బయటపడ్డాయని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

Woman held for trying to supply drugs to husband in jail

పిల్లలే పిల్లాడ్ని చంపేశారు!

ముగ్గురు బాలురు కలిసి మరో అబ్బాయిని అహరించి దారుణంగా చంపేసి, ఆ తర్వాత ఆరు రోజులకు హతుడి తలిదండ్రులకు ఫోన్ చేసి రూ.పది లక్షలు డిమాండ్‌ చేసిన సంఘటన జఫ్రాబాద్‌ ప్రాంతంలో జరిగింది.

13 ఏళ్ల ఆ బాలుడిని అపహరించిన ముగ్గురు అబ్బాయిలు కూడా 13-17 ఏళ్ల వయసులోపు వారే. ఆ ముగ్గురు బాలనేరస్తులను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురిలో ఒకరి తల్లి హతుడి ఇంట్లో పని మనిషిగా ఉంటోంది.

పని మనిషి కుమారుడే అపహరణ పథకం వేశాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి ఆ కుర్రాడిని అపహరించారు. ముందుగానే అదే ప్రాంతంలో ఒక గదిని అద్దెకు తీసుకుని ఉండటంతో నేరుగా ఆ బాలుడిని అక్కడికే తీసుకెళ్లారు. అతడు గట్టిగట్టిగా కేకలు వేయడంతో భయపడి బంగ్ తాగించారు.

అప్పటికీ ఫలితం లేకపోవడంతో ఆ కుర్రాడిని గొంతు పిసికి చంపేశారు. ఆ తర్వాత ప్లాస్టిక్‌ సంచీలో అతడి శవాన్ని ఉంచి ఎవరూ లేనిచోట పడేశారు. బాగా కుళ్లిపోయి, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆ కుర్రాడి శవాన్ని గుర్తించిన పోలీసులు 72 గంటల పాటు వేచి చూశారు. దీంతో విషయం వెలుగు చూసింది.

English summary
A woman was arrested for allegedly attempting to supply drugs to her husband, an undertrial prisoner, at the district jail here.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X