మహిళా జర్నలిస్టుపై గ్యాంగ్ రేప్, ఒకరి అరెస్టు
మీర్జాపూర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ మహిళా జర్నలిస్టుపై సామూహిక అత్యాచారం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని వింధ్యాచల్ ప్రాంతంలో 30 ఏళ్ల మహిళా జర్నలిస్టుపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘటన గురువారం సాయంత్రం జరిగిందని పోలీసులు చెప్పారు.
అష్టభుజ కొండకు వెళ్తున్న మహిళా జర్నలిస్టుపై ఆధునిక కీచకులు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఇద్దరు నిందితుల్లో ఒకతన్ని అరెస్టు చేసినట్లు వింధ్యాచల్ రేంజ్ డిఐజి శ్రీవాత్సవ చెప్పారు అతన్ని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలిపారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

వింధ్యాచల్ మందిర్‌పై వార్తా సేకరణకు ఆ మహిళా జర్నలిస్టు వెళ్లినట్లు తెలుస్తోంది. దుండగులు ఆమెను అటవీ ప్రదేశానికి తీసుకుని వెళ్లి అత్యాచారం చేసినట్లు సమాచారం. సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఆటోలు లభించకపోవడంతో మహిళా జర్నలిస్టు నడిచి వస్తున్న సమయంలో ఆ సంఘటన జరిగినట్లు చెబుతున్నారు.
నడిచి వస్తుండగా వచ్చిన జీపును చూసి ఆమె ఆపాలని సైగ చేసినట్లు, జీపు ఆపి ఆమెను జీపులో ఎక్కించుకున్నట్లు చెబుతున్నారు. జీపులో ఆమెను అటవీ ప్రదేశానికి తీసుకుని వెళ్లి దురాచారానికి పాల్పడినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications