చేయి నుంచి జారిన రూ.2వేల నోటు కోసం రైలు వస్తుండగా ట్రాక్ పైకి దూకిన యువతి

ఢిల్లీ: ఇరవై ఆరేళ్ల ఓ యువతి రూ.2వేల నోటు కోసం రైలు ట్రాక్ పైకి దూకింది. ఆమె ట్రాక్ పైకి దూకే సమయానికి రైలు వస్తోంది. కానీ తృటిలో ప్రమాదం నుంచి బయటపడింది. ఈ సంఘట ఢిల్లీలోని ద్వారక మోర్ మెట్రో స్టేషన్ వద్ద జరిగింది. ఆమె రైలు వస్తుంటే చూసుకోకుంటా.. రూ.2వేల నోటు కోసం దూకింది.

ఆ యువతి రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వచ్చింది. అయితే ఆ సమయంలో తన దగ్గరున్న రూ.2వేల నోటు చేజారి ట్రాక్ పైన పడిపోయింది. ఓ పక్క రైలు వస్తుండగా, మరోవైపు ఆమె ట్రాక్ పైకి దూకింది. ఆమె బయటకు వచ్చేలోపు రైలు వచ్చింది.

Woman jumps on Delhi metro track to grab Rs 2,000 note, goes under train: unhurt

ప్లాట్ ఫాం వద్ద ట్రాక్‌ పక్కన ఉన్న కొంచెం ఖాళీలో రైలు వెళ్లేంత వరకు ఆమె వేచి చూడాలని భావించింది. కానీ లోకో పైలట్ ఆమెను గమనించాడు. దీంతో రైలును ఆపేశాడు. ఆమె చిన్న ఖాళీలో మాత్రమే ఉంది. లోకో పైలట్ రైలును ఆపాడు. ఆ రైలులోని రెండు కోచ్‌లు ఆమెను దాటుకొని వెళ్లాయి. ఆ తర్వాత ఆమెను పైకి తీసుకు వచ్చారు. సీఐఎస్ఎ‌ఫ్‌ సేవలకు భంగం వాటిల్లినందుకు వారికి ఆమె రాతపూర్వకంగా క్షమాపణలు తెలిపింది.

దీనిపై రైల్వే అధికారులు మాట్లాడుతూ... ఆమె ట్రాక్ పక్కన గల ఖాళీలో నిలబడ్డారని, మెట్రో రైలుకు చెందిన రెండు కోచ్‌లు ఆమెను దాటుకొని వెళ్లాయని, అనంతరం రైలు ఆగిందని, అఫ్పుడు ఆమె భద్రంగా బయటకు వచ్చిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+