17 ఏళ్ల బాలుడు, 26 ఏళ్ల యువతి హోటల్‌కెళ్లి, అంతా అయ్యాక..

Posted By:
Subscribe to Oneindia Telugu

ఢిల్లీ: ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన యువతితో ఏకాంతంగా గడిపేందుకు వచ్చిన పదిహేడేళ్ల బాలుడు పోలీసులకు అడ్డంగా దొరికాడు. అంతేకాదు, ఆ యువతియే తనను రమ్మందని చెప్పి ఆమెను కూడా పోలీసులకు పట్టించాడు.

ఈ సంఘటన దేశ రాజధాని న్యూఢిల్లీలో జరిగింది. ఫేస్‌బుక్ పేజీలో జిందా పేరుతో ఉన్న 26 ఏళ్ల యువతితో బాలుడు పరిచయం పెంచుకున్నాడు. సోమవారం వారిద్దరు వసంత్ కుంజ్ ప్రాంతంలోని ఓ హోటల్లో కలుసుకున్నారు. వారు ఏకాంతంగా గడుపుతున్నారు.

 Woman, juvenile charge each other with forced sex, get booked

అదే సమయంలో ఆమె హఠాత్తుగా పోలీసులకు ఫోన్ చేసింది. తన పైన అతను అత్యాచారం చేశాడని వారికి చెప్పింది. అయితే, ఏకాంతంగా గడిపేందుకు రావాలని ఆమెనే తనను కోరిందని ఆ బాలుడు చెప్పాడు.

దీంతో ఇద్దరి పైనా పోలీసులు కేసు నమోదు చేశారు. బాలుడి పైన అత్యాచారం, మహిళ పైన పోస్కో చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదు. మనీ ట్రాఫింగ్‌లో భాగం కావొచ్చని అనుమానిస్తున్నారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 17-year-old boy entered a physical relationship with a 26-year-old woman who met him on Facebook.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి