Illegal affair: మగాళ్ల బాత్ రూమ్ లో ప్రియురాలి హత్య, వాటర్ ట్యాప్ తో ఫినిష్, వెంటాడి !

ముంబాయి/చెన్నై: ఆమెకు 24 సంవత్సరాలు, అతనికి 19 సంవత్సరాలు. ఇద్దరూ అక్రమ సంబంధం సాగిస్తూ ఏడాది నుంచి ఒకే చోట నివాసం ఉంటున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎవరి పని వాళ్లు చేసుకుంటున్న యువతి, యువకుడు రాత్రి ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి చేసుకోకుండా ఆ యువతి ఆమె కంటే ఐదు సంవత్సరాల తక్కువ వయసు ఉన్న యువకుడితో కాపురం చేస్తున్నది. ఓ విషయంలో గొడవపడిన యువకుడు ఆమెను రోడ్డు మీద వెంబడించాడు. ప్రియుడి దెబ్బతో పారిపోయిన యువతి మెట్రో రైల్వే స్టేషన్ లోని మగాళ్ల బాత్ రూమ్ లో తల దాచుకునింది. అంతే బాత్ రూమ్ లో దూరిన ప్రియుడు వాటర్ ట్యాప్ తో ప్రియురాలి తల నుజ్జునుజ్జు చేసి స్పాట్ లో దారుణంగా చంపేయడం కలకలం రేపింది.

వయసులో ఐదు ఏళ్లు పెద్దది

వయసులో ఐదు ఏళ్లు పెద్దది

ముంబాయిలోని అంధేరి ఏరియాలో జ్యోతి గావ్డే (24) అనే యువతి నివాసం ఉంటున్నది. ఇదే ప్రాంతంలో నివాసం ఉంటున్న నియాజ్ అన్సారీ అలియాస్ నియాజ్ అలియాస్ అన్సారీ (19) అనే యువకుడు అతని కంటే 5 సంవత్సరాలు ఎక్కువ వయసు ఉన్న జ్యోతిని లైన్ లో పెట్టాడు. కుర్రాడు మోజు పడుతున్నాడని జ్యోతి కూడా అతనితో ఎంజాయ్ చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

 హద్దులు లేని రొమాన్స్

హద్దులు లేని రొమాన్స్

వయసులో చిన్నవాడైన అన్సారీతో జ్యోతి అక్రమ సంబంధం పెట్టుకునింది. మీరారోడ్డు సమీపంలోని జ్యోతి, అన్సారీ కలిసి కాపురం పెట్టేశారు. అడిగే దిక్కు లేకపోవడంతో జ్యోతి, అన్నారీ రొమాన్స్ హద్దులు దాటిపోయింది. పగలు ఇద్దరూ ముంగాయి నగరంలో అంధేరీ తూర్పు విభాగంలో చెత్తసేకరించి సాయంత్రం పని ముగించుకుని రూమ్ కు చేరుకుని ఎంజాయ్ చేస్తున్నారు.

అక్రమ సంబంధం తంటాలు

అక్రమ సంబంధం తంటాలు


పెళ్లి చేసుకోకపోయినా జ్యోతి, అన్సారీ కలిసి కాపురం పెట్టేశారు. వీరి అక్రమ సంబంధం గురించి చుట్టుపక్క వాళ్లకు తెలుసు. జ్యోతి, అన్సారీ విషయంలో మనం తలదూర్చి లేనిపోని సమస్యలు ఎందుకులే అంటూ చుట్టుపక్క వాళ్లు అనుకున్నారు. జ్యోతి, అన్సారీకి ఓ జంట సహకారం అందిస్తున్నది తెలిసింది.

 ప్రియుడి దెబ్బతో జ్యోతి పరుగో పరుగు

ప్రియుడి దెబ్బతో జ్యోతి పరుగో పరుగు

రాత్రి రొమాన్స్ చేసి అలసిపోయి నిద్రపోయిన జ్యోతి, అన్సారీ ఉదయం నిద్రలేచి ముంబాయిలోని అధేరి తూర్పు విభాగంలో వాళ్లు రోజు పని చేస్తున్న ఏరియాలో చెత్త సేకరించడానికి బయలుదేరారు. మరో జంట కూడా జ్యోతి, అన్సారీ వెంట బయలుదేరారు. మార్గం మద్యలో జ్యోతి, అన్నారీల మద్య గొడవ జరిగింది.

మెట్రో మగాళ్ల బాత్ రూమ్ లో !

మెట్రో మగాళ్ల బాత్ రూమ్ లో !


ఆ సందర్బంలో జ్యోతి మీద దాడి చెయ్యడానికి ఆమె ప్రియుడు అన్సారీ ప్రయత్నించాడు. ఆ సమయంలో ప్రియుడు అన్సారీ దెబ్బకు భయపడిన జ్యోతి రోడ్డు మీద పరుగు తీసింది. తరువాత రోడ్డు పక్కన ఉన్న మెట్రో రైల్వే స్టేషన్ కింద ఏర్పాటు చేసిన మగాళ్ల బాత్ రూమ్ లోకి పరుగు తీసిన జ్యోతి ప్రాణభయంతో లోపల దాక్కొనింది. తన ప్రియురాలు జ్యోతి బాత్ రూమ్ లో దాక్కొనిందని ఆమె ప్రియుడు అన్సారీ తెలుసుకున్నాడు.

 వాటర్ ట్యాప్ తో చంపేశాడు

వాటర్ ట్యాప్ తో చంపేశాడు


మగాళ్ల బాత్ రూమ్ లోకి వెళ్లిన అన్సారీ అతని ప్రియురాలు జ్యోతి బయటకు వెళ్లకుండా బాత్ రూమ్ లోపల గడిపెట్టి లాక్ చేశాడు. తరువాత బాత్ రూమ్ లో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాప్ తీసుకుని జ్యోతి తల మీద దాడి చేశాడు. బయటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో జ్యోతి కేకలు వేసింది. ఎన్ని రోజుల నుంచి కసిపెంచుకున్నాడో ఏమో ప్రియురాలు జ్యోతి తలను వాటర్ ట్యాప్ తో నుజ్జునుజ్జు చేసిన అన్నారీ ఆమెను స్పాట్ లో చంపేశాడు.

సీసీటీవీ కెమెరాల్లో అన్సారీ అరాచకం

సీసీటీవీ కెమెరాల్లో అన్సారీ అరాచకం


మెట్రో రైల్వే స్టేసన్ లో బాత్ రూమ్ లో క్లీన్ చేస్తున్న ఓ వ్యక్తి అన్సారీని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. బాత్ రూమ్ లో క్లీన్ చేసే వ్యక్తి మీద దాడి చేసిన అన్సారీ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయాడు. మెట్రో రైల్వే స్టేషన్ లో పని చేస్తున్న వ్యక్తి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ కెమెరాలు పరిశీలించిన పోలీసులు మొదట జ్యోతి వెంట వెళ్లిన జంటను పట్టుకున్నారు. సీసీటీవీ కెమెరాల్లో అన్సారీ అరాచకం తెలుసుకున్న పోలీసులు షాక్ అయ్యారు.

బెంగాల్ పారిపోవడానికి ప్లాన్...... లాక్ డౌన్ దెబ్బతో అరెస్టు

బెంగాల్ పారిపోవడానికి ప్లాన్...... లాక్ డౌన్ దెబ్బతో అరెస్టు


ప్రియురాలు జ్యోతిని హత్య చేసిన అన్సారీ పశ్చిమ బెంగాల్ పారిపోవడానికి ప్రయత్నించాడు. లాక్ డౌన్ కారణంగా పశ్చిమ బెంగాల్ వెళ్లడానికి సరైన సమయంలో వాహనాలు చిక్కకపోవడంతో అన్నారీ పోలీసులకు పట్టుబడిపోయాడు. ప్రియురాలు జ్యోతిని అన్సారీ చిన్న విషయంలో ఆవేశంలో హత్య చేశాడని ముంబాయిలోని అంధేరి పోలీసులు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+