ప్రియాను చంపించింది భర్తే: ప్రాణం పోతున్నా బిడ్డను కాపాడింది
దేశ రాజధానిలో జరిగిన సంచలన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. వాయవ్య ఢిల్లీలోని రోహినీ ప్రాంతంలో బుధవారం హత్యకు గురైన మహిళ కేసులో ఆమె భర్త హంతకుడని తేల్చారు.
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో జరిగిన సంచలన హత్యకేసు మిస్టరీని పోలీసులు ఒక్కరోజులోనే ఛేదించారు. వాయవ్య ఢిల్లీలోని రోహినీ ప్రాంతంలో బుధవారం హత్యకు గురైన మహిళ కేసులో ఆమె భర్త హంతకుడని తేల్చారు. 34 ఏళ్ల ప్రియా మెహ్రాను ఆమె భర్త పంకజ్ మెహ్రా హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించి అరెస్ట్ చేశారు.
ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. వ్యాపారి అయిన పంకజ్.. ఓ వ్యక్తి నుంచి రూ.40 లక్షలు అప్పు తీసుకుని తీర్చకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వ్యక్తి కొంతకాలంగా పంకజ్‌ను బెదిరిస్తున్నాడు. ఎలాగైనా అతని నుంచి తప్పించుకోవాలని ప్రణాళిక రచించుకున్న పంకజ్.. తన భార్య ప్రాణాలు పణంగా పెట్టాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే కొందరు వ్యక్తులకు సుపారీ ఇచ్చి భార్యను చంపిచేస్తే అది చేయించింది తనకు అప్పు ఇచ్చిన వ్యక్తేనని నమ్మించి కేసు పెట్టచ్చని ప్లాన్ వేసినట్లు పంకజ్ పోలీసులకు తెలిపాడు.
ప్రాణాలు పోతున్నా.. బిడ్డను కాపాడుకుంది..
కాగా, కారులో వెళుతుండగా కొందరు వ్యక్తులు అడ్డుపడి ఇష్టారాజ్యంగా కాల్పులు జరిపారు. పంకజ్ ప్లాన్ ప్రకారం ఎక్కువ బుల్లెట్లు ప్రియకు తగిలేలా కాల్పులు జరిపారు. అంతగా బుల్లెట్లు మీదకి దూసుకొస్తున్నా.. ప్రియ తన కుమారుడిని సీటు వెనకాల దాచి బిడ్డ ప్రాణాలు కాపాడుకుంది. కాగా, వరుస హత్యలు ఢిల్లీ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. గత మూడు రోజుల్లోనే ఐదు హత్య చోటు చేసుకోవడం గమనార్హం.












Click it and Unblock the Notifications