వివాహేతర సంబంధం: భార్యను చంపి ప్రియుడి ఇంట్లో ఇలా..
లక్నో:వివాహేతర సంబంధం కొనసాగిస్తోందనే నెపంతో భార్యను గొంతు నులిమి చంపాడు భర్త. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని శామ్లి జిల్లాలో చోటు చేసుకొంది.
శామ్లి జిల్లాలోని ఖేరా కుర్తాన గ్రామానికి చెందిన ఓ వివాహిత మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని తెలుసుకొన్న భర్త ఆమెను గొంతు పిసికి చంపేశాడు.

అంతేకాదు భార్యను చంపేసి తన భార్యతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న వ్యక్తి ఇంట్లో పడేశారు. అయితే ఈ హత్యకు వివాహిత సోదరుడు కూడ సహకరించాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తే అసలు విషయం వెలుగు చూసింది.
దీంతో వివాహిత భర్తను మృతురాలి సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల విచారణలో తాము చేసిన నేరాన్ని నిందితులు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications