దారుణం: ఆడపిల్ల పుట్టిందని కోడలికి నిప్పంటించారు

పాట్నా: బీహార్‌లో దారుణం జరిగింది. ఆడపిల్లకు జన్మనిచ్చిందనే కారణంతో ఓ మహిళకు నిప్పంటించిన ఘటన ముజ్జఫాపుర్‌కు సమీపంలోని మహంత్ మనియారి అనే గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన కథనం ప్రకారం... గ్రామానికి చెందిన షర్మిల సాహాను అనే మహిళ నిద్రిస్తున్న సమయంలో అత్తింటి వారు కిరోసిన్ పోసి నిప్పంటించారు.

దీంతో చుట్టుపక్కల వారు ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. ఈ ప్రమాదంలో షర్మిల శరీరం తొంభై శాతం కాలిపోయింది. షర్మిలకు పెళ్లైనప్పటి నుంచి అత్తింటి వారి నుంచి వేధింపులు ఎదుర్కొంటోంది. అదనపు కట్నం తీసుకురావాలని భర్త నిత్యం ఆమెను వేధించేవాడని పోలీసులు తెలిపారు.

woman on fire for giving birth to girl child in bihar

అయితే ఇటీవలే షర్మిల ఆడపిల్లకు జన్మనివ్వడంతో అత్తింటి వారు మరింతగా రెచ్చిపోయారు. ఇంట్లో షర్మిల ఒక్కతే నిద్రిస్తున్న సమయంలో ఆమెపై కిరోసిన్ పోసి హ‌త్యాయ‌త్నం చేశార‌ు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు న‌మోదు చేసుకుని పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

బీహార్‌లో ఎగిరిన పాకిస్థాన్ జెండా

బీహార్‌లో పాకిస్థాన్‌ జెండా ఎగరడం పెను కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే... నలంద జిల్లాలో ఓ వ్యక్తి తన ఇంటిపై ఎగురవేశాడు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సొంత నియోజకవర్గమైన నలంద జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికకంగా కలకలం రేపింది.

స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్నారు. జెండాను తొల‌గించి, జెండా ఎగ‌రేసిన అన్వ‌రుల్ హ‌క్‌ను అరెస్ట్ చేశారు. లోక‌ల్ టీవీ ఒక‌టి అన్వ‌రుల్ ఇంటిపై ఎగురుతున్న పాక్ జెండాను చూపించ‌డంతో జిల్లా అధికారులు వెంట‌నే రంగంలోకి దిగారు.

పాక్ జెండాను తానే ఎగ‌రేశాన‌ని, అలా చేస్తే త‌న భార్య‌కు కొడుకు పుడ‌తాడ‌న్న న‌మ్మ‌కంతోనే ఇలా చేశాన‌ని పోలీసుల విచార‌ణ‌లో అన్వ‌రుల్ అంగీక‌రించాడు. పాట్నాలో కొంద‌రు పాకిస్థాన్‌కు అనుకూలంగా నినాదాలు చేసిన నేప‌థ్యంలో ఈ ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+