కాలేజ్ విద్యార్థినిలకు సెక్స్ పాఠాలు, లేడీ ప్రొఫెసర్ అరెస్టు, సీబీఐ, వ్యభిచారం, బ్రోకర్ పని!

Posted By:
Subscribe to Oneindia Telugu

చెన్నై: కాలేజ్ విద్యార్థులను లైంగిక కార్యకలాపాలకుప్రేరేపించిన ఆరోపణలపై లేడీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలా దేవిని విరుద్ నగర్‌ జిల్లాలోని అరుప్పుకోటై పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థులకు విద్యా బుద్దులు నేర్పించాల్సిన మహిళా ప్రొఫెసర్ ఇలాంటి పనికిమాలిన పని చేస్తూ అడ్డంగా దొరికిపోయిందని, బ్రోకర్ పని చేస్తున్న నిర్మలా దేవిని శాస్వతంగా ఉద్యోగం నుంచి తొలగించాలని మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

రిటైడ్ ఐఏఎస్ అధికారి

రిటైడ్ ఐఏఎస్ అధికారి

తమిళనాడులోని విరుద్ నగర్ జిల్లాలోని అరుప్పుకోటైలోని దేవాంగర్ ఆర్ట్స్ కాలేజ్ విద్యార్థినిలకు సెక్స్ పాఠాలు చెప్పిన నిర్మలా దేవి వ్యవహారంలో లోతుగా విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆ రాష్ట్ర గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ఆదేశాలు జారీ చేశారు. రిటైడ్ ఐఏఎస్ అధికారి ఆర్. సంతానంను ప్రత్యేక విచారణ అధికారిగా గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ నియమించారు.

ఎంత మందికి వల వేశారు

ఎంత మందికి వల వేశారు

దేవాంగర్ ఆర్ట్స్ కాలేజ్ లో గత 15 ఏళ్లుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉద్యోగం చేస్తున్న నిర్మలా దేవి కాలేజ్ అమ్మాలను వ్యభిచారం కూపంలోకి ఎంతమందిని దించారు అనే విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు. అరుప్పుకోటై ఆర్ డీఓ చెల్లప్ప, పోలీస్ ఇన్స్ పెక్టర్ బాలమురగన్, తహసిల్దార్ కార్తికేయని కాలేజ్ లో విద్యార్థులు, అధ్యాపకులను విచారణ చేసి వివరాలు సేకరిస్తున్నారు.

నీచంగా మాట్లాడింది

నీచంగా మాట్లాడింది

ఇటీవల విద్యార్థినిలతో సెల్ ఫోన్ లో మాట్లాడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి మదురై కామరాజు యూనివర్శిటీ సీనియర్ అధికారులకు కాలేజ్ అమ్మాలు కావాలని, వారికి లైంగిక సుఖం ఇస్తే ప్రతిఫలంగా మీకు డబ్బుతో పాటు పరీక్షల్లో మంచి మార్కులు వేయిస్తానని నీచంగా మాట్లాడింది. ఈ వ్యవహారం ఎవ్వరికీ తెలీదని, మనమద్యనే ఉంటుందని నిర్మలా దేవి విద్యార్థినిలకు చెప్పింది.

ఒత్తిడి చేసిన నిర్మలా దేవి

ఒత్తిడి చేసిన నిర్మలా దేవి

మేడం అలాంటి పాడుపనులు తాము చెయ్యమని, ఇలా ఎప్పుడు మాట్లాడకండి అని విద్యార్థినిలు చెబితో త్వరలో పరీక్షలు వస్తున్నాయని, ఆలోచించుకోవాలని, నా మాట వింటే మీరు కాలేజ్ కు రాకపోయినా అటెండెన్స్ వేయిస్తానని, ఈ విషయం ఇతరులకు ఎవ్వరికీ తెలీదని, మీరుకూడా ఎవ్వరికీ చెప్పకూడదని విద్యార్థినిల మీద నిర్మలా దేవి తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చింది.

వాట్సాప్ లో వైరల్

వాట్సాప్ లో వైరల్

నలుగురు విద్యార్థినిలకు అసిస్టెంట్ ప్రొఫెసర్ లైంగిక పాఠాలు చెప్పిన సంభాషణలు వాట్సాప్ లో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహారంలో బాధిత విద్యార్థినిలు కాలేజ్ ప్రిన్సిపల్ కు, పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో నిర్మలా దేవిని సస్పెండ్ చేశారు.

ఇంటికి తాళం వేసింది

ఇంటికి తాళం వేసింది


నిర్మలా దేవిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని మదురై కామరాజ్ యూనివర్సిటీ వైస్‌ చాన్సలర్‌ చెల్లదురై, ఉన్నత విద్యశాఖ కార్యదర్శి సునీల్‌ బాలివాల్ మీడియాకు చెప్పారు. ఇంటిలోపల తాళం వేసుకున్న నిర్మలా దేవి బయటకు రాలేదు. నిర్మలా దేవి భర్త, తహసిల్దార్ సమక్షంలో ఇంటి తాళం పగలగొట్టిన పోలీసులు అమెను అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.

సీబీఐ విచారణ

సీబీఐ విచారణ

విద్యార్థినిలకు లైంగిక పాఠాలు చెప్పిన నిర్మలా దేవి తమిళనాడు పరువు తీశారని, ఈ వ్యవహారంలో ఆమె వెనుక ఉన్న పెద్దలను బయటకు లాగడానికి సీబీఐతో విచారణ చేయించాలని డీఎంకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే. స్టాలిన్ డిమాండ్ చేశారు. నిర్మలా దేవి లాంటి వ్యక్తులను నడిరోడ్డులో నిలబెట్టి ఎన్ కౌంటర్ చెయ్యాలని, ఆమె మీద కఠిన చర్యలు తీసుకుంటామని తమిళనాడు మంత్రి జయకుమార్ అన్నారు.

చాలమందితో లింక్

చాలమందితో లింక్

కాలేజ్ అమ్మాయిలను వ్యభిచారం కూపంలోకి లాగడానికి తీవ్రస్థాయిలో ఒత్తిడి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి వెనుక చాల మంది పెద్దలు ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని, ఉన్నత స్థాయి విచారణ చేసి అందరిమీద కఠిన చర్యలు తీసుకోవాలని పీఎంకే యూత్ విభాగం అధ్యక్షుడు, ఎంపీ అన్బుమణి రాందాస్ డిమాండ్ చేశారు.

ఆడియో కట్ చేశారు

ఆడియో కట్ చేశారు


తాను విద్యార్థినిలతో ఫోన్ లో మాట్లాడింది నిజమే, ఆ గొంతు తనదే అని అసిస్టెంట్ ప్రొఫెసర్ నిర్మలా దేవి పోలీసుల విచారణలో అంగీకరించారు. అయితే తాను వారికి లైంగిక పాఠాలు చెప్పలేదని, ఆడియో కట్ చేసి వాట్సాప్ లో విడుదల చేసి తన పరువు తీశారని నిర్మలా దేవి ఆరోపించారు. తహసిల్దార్ సమక్షంలో నిర్మలా దేవిని పోలీసులు విచారణ చేస్తున్నారు. నిర్యలా దేవి వ్యవహారంపై తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మొదలైనాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A lot is happening over an audio clip which had a woman professor luring girl students to yield to 'sexual favours' of higher ranking authorities, to get marks and money in return. Nirmala Devi, who was already suspended by the college management, was arrested by the police from her house.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి