స్త్రీపై వారంపాటు గ్యాంగ్ రేప్: భర్త ఆత్మహత్యాయత్నం

Posted By:
Subscribe to Oneindia Telugu

జైపూర్: రాజస్థాన్‌లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. పాతికేళ్ల వయస్సు గల మహిళను ఓ ముఠా అపహరించి ఆమెపై వారం పాటు వివిధ ప్రాంతాల్లో అత్యాచారానికి పాల్పడింది. ముఠాలోని ఎనిమిది ఆణె నవంబర్ 22, 28 తేదీల మధ్య అఘాయిత్యానికి పాల్పడ్డారు.

వారి నుంచి తప్పించుకుని ఎలాగో ఇల్లు చేరిన ఆమెకు మరో షాక్ తగిలింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త తీవ్రంగా కలత చెంది ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన చురు జిల్లాలో మగంళవారంనాడు చోటు చేసుకుంది.

తాను ఈ నెల 22వ తేదీన అసల్ ఖేరీ బస్టాండ్ వద్ద వేచి ఉండగా ఓ జీపు వచ్చి ఆగిందని, జీపులోో ముగ్గరు ఉన్నారని, వారు తననువ భలేరీ పట్టణం వరకు తీసుకుని వెళ్తామని చెప్పారని, ఆ ముగ్గురితో పాటు తాను జీపులో కూర్చున్నానని బాధితురాలు పోలీసులకు చెప్పింది.

Woman repeatedly gangraped over a week, shocked husband attempts suicide

అకస్మాత్తుగా జీపును ఓ నిర్మానుష్యమైన ప్రదేశానికి మళ్లి, ఓ గుడిసెలో తనను బంధించి పలుమార్లు తనపై అత్యాచారం చేశారని ఆమె చెప్పారు. మూడు రోజు తర్వాత మహిళను ఆ ముగ్గురు చురు జిల్లాలోని స్లిమా గ్రామానికి తీసుకుని వెళ్లారు. ఆమెను వారు లక్ష రూపాయలకు నలుగురు వ్యక్తులకు విక్రయించారు.

ఆ నలుగురు వ్యక్తులు ఆమెను గుర్తు తెలియని ప్రదేశంలో బంధించి మూడు రోజుల పాటు ఆమెపై అత్యాచారం చేశారు. అక్కడి నుంచి బయటపడడానికి ఆమె తీవ్రంగా ప్రయత్నించారు. ఆ తర్వాత లీలా రామ్ అనే వ్యక్తితో ఆమెకు పెళ్లి చేయడానికి ఆ నలుగురు వ్యక్తులు ప్రయత్నించారు. ఆమెను లీలా రామ్‌కు రెండు లక్షల రూపాయలకు విక్రయించినట్లు చెప్పారని సమాచారం.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 25-year-old woman was allegedly kidnapped, gang raped and trafficked by eight men to different locations in Churu district between November 22 to 28.
Please Wait while comments are loading...