వ్యభిచారం చేయనన్నందుకు యువతి వక్షోజాలు కోశారు

కథనం ప్రకారం... ఇరవై నాలుగేళ్ల యువతిని గుజరాత్ నుంచి తీసుకు వచ్చి మహారాష్ట్ర బీవండిలోని వ్యభిచార గృహానికి అమ్మేశారు. వ్యభిచార వృత్తి చేసేందుకు ఆమె నిరాకరించింది. దీంతో నిర్వహకురాలు, మరో యువతితో కలిసి ఆమె వక్షోజాలను కోసి ఆమె పట్ల క్రూరంగా ప్రవర్తించారు.
అపస్మారక స్థితిలో ఉన్న ఆ యువతిని స్థానికులు దగ్గరలోని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం బాధితురాలు మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. పోలీసులు వ్యభిచార గృహం నిర్వాహకురాలు రూబీ, ఇద్దరు యువకులు ఆలం, అఫ్రాజ్‌లను శనివారం అరెస్టు చేశారు.
మరోచోట ఓ యువతి అత్యాచారాన్ని ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసీ నిప్పు అంటించారు. ఈ ఘటన థానే జిల్లాలో జరిగింది. లఖాన్ అనే వ్యక్తి శుక్రవారం రాత్రి తోటి ఉద్యోగిని ఇంటికి వెళ్లాడు. ఆమె ఒంటరిగా ఉండటంతో అత్యాచారయత్నం చేశాడు. మహిళ ప్రతిఘటించడంతో కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. నిందితుడిని అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications