నగ్నంగా మహిళ మృతదేహం: అత్యాచారం జరిపి హత్య?
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలకు సంబంధించి మరో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో 30 ఏళ్ల వయస్సు గల మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో పడి ఉంది. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
మహిళపై అత్యాచారం చేసి, ఆ తర్వాత ఆమెను హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహంపై పలు గాయాలు ఉన్నాయి. పైగా మృతదేహం నగ్నంగా పడి ఉంది. దీంతో అత్యాచారం చేసి ఆమెను హత్య చేసి ఉంటారనే అనుమానాలకు తావిస్తోంది.

ఆ మహిళ ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గోరఖ్‌పూర్‌కు చెందింది. కాగా, సుల్తాన్‌పూర్ ప్రాంతంలో నివాసం ఉంటోంది. పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. కాగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆమెపై అత్యాచారం జరిగిందా, లేదా అనేది పోస్టుమార్టం నివేదికలో తేలే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications