బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నేను అమ్మ జయలలిత కుమార్తెను, డీఎన్ఏ పరీక్ష, సుప్రీంకోర్టులో విచారణ, ఏం చెప్పిందంటే !

నేను జయలలిత కుమార్తెను, డీఎన్ఏ పరీక్షలు చెయ్యండిసుప్రీం కోర్టులో బెంగళూరు మహిళ పిటిషన్ దాఖలు, విచారణసీనియర్ న్యాయవాది వాదనలు, సుప్రీం కోర్టు ఏం చెప్పిందంటే ?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: నేను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తె అంటూ బెంగళూరు మహిళ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఇలాంటి పిటిషన్లు విచారించడం మంచిది కాదని, ఇలాంటి పిటిషన్ల విచారణను ప్రోత్సహించినట్లు అవుతోందని సుప్రీం కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.

బెంగళూరుకు చెందిన అమృత అలియాస్ మంజుల తాను తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కుమార్తెను, తనకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని, తనను జయలలిత కుమార్తెగా గుర్తించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Woman’s plea claiming to be Jayalalithaa’s daughter dismissed by Supreme Court

అంతే కాకుండా జయలలితకు మళ్లీ హిందూ సాంప్రధాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని పిటిషన్ లో మనవి చేశారు. సోమవారం సుప్రీం కోర్టు న్యాయస్థానంలో పిటిషన్ విచారణకు వచ్చింది. అమృత అలియాస్ మంజుల తరపున సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదించారు.

జయలలితకు తాను జన్మించానని, జయలలిత కుమార్తెగా తనను గుర్తించాలని అమృత అలియాస్ మంజుల పిటిషన్ లో మనవి చేశారు. తాను జయలలిత కుమార్తె అని నిరూపించుకోవడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని సుప్రీం కోర్టులో మనవి చేశారు. జయలలితకు వివాహం కాలేదని, ఆమెకు కుమార్తె ఎలా పుట్టిందని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి పిటిసన్లు విచారిచడంలో అర్థం లేదంటూ అమృత అలియాస్ మంజుల దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

English summary
The Supreme Court has refused to entertain the petition filed by a Bengaluru woman- who claimed to be former Tamil Nadu Chief Minister Jayalalithaa's daughter.  The woman identified as Amrutha alias Manjula had filed a petition with the Supreme Court, demanding a DNA test to further cement her claims.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X