దుస్తులు లాగి సెల్ ఫోన్ లాక్కొని లైంగిక వేధింపులు

Posted By:
Subscribe to Oneindia Telugu

బెంగుళూరు: కర్ణాకట రాష్ట్రంలో మహిళల పట్ల పోకిరీలు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా మహిళలు కన్పిస్తే చాలు వేధింపులకు పాల్పడుతున్నారు.ఓ యువతిపై ముగ్గురు దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు.ఈ ఘటన బెంగుళూరులోని ఎంజి రోడ్డులో బుదవారం నాడు రాత్రి చోటుచేసుకొంది.

కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరులోని హలనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ముగ్గురు యువకులు ఓ యువతిపై లైంగికదాడికి పాల్పడ్డారు. ఎంజిరోడ్డులోని హోటల్ వద్ద ఓ యువతి పార్టీ ముగించుకొని ఇంటికి వెళ్ళడానికి ఉబేర్ క్యాబ్ కోసం వేచి చూస్తోంది.

woman sexual harassed while waiting for cab in banglore

ఈ సమయంలో బైకుపై వచ్చిన ముగ్గురు దుండగులు యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దుస్తులు లాగేసేందుకు ప్రయత్నించారు.ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో దుండగులు ఆమె బ్యాగులో ఉన్న ఐ ఫోన్ ను లాక్కోని పారిపోయారు. రోధిస్తున్న యువతిని గమనించిన ఉబేర్ క్యాబ్ డ్రైవర్లు సమీప హలనూరు పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్ళారు.

మరో ఘటనలో పట్టపగలే కొందరు పోకిరీలు ఓ మహిళ దుస్తులు లాగి వేధించారు. బెంగుళూపు కుమారస్వామి లే అవుట్ పోలిస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకొంది.ఈ నెల 19వ, తేది మధ్యాహ్నం ఓ మహిళ కారులో వెళ్తుండగా కొందరు యువకులు ఆమె కారును అడ్డుకొన్నారు. కారు దిగుతుండగానే దుస్తులు లాగి కారును ధ్వంసం చేసి సెల్ పోన్ ను లాక్కొని పారిపోయారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
woman sexual harassed while waiting for cab in banglore on wednesday night.she complaint against them in policestation.
Please Wait while comments are loading...