రివాల్వర్ తో కాల్చి మహిళను చంపేశారు
ముజఫర్ నగర్: ఇంటిలో ఉన్న మహిళ మీద కాల్పులు జరిపి దారుణంగా హత్య చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగరలోని షాబుద్దిన్ పూర్ ప్రాంతంలో 20 సంవత్సరాల మహిళ నివాసం ఉంటున్నారు.
ఈమె పలు ఇండ్లలో పని చేస్తు జీవనం సాగిస్తున్నది. ఆదివారం సాయంత్రం పని ముగించుకుని ఇంటికి వెళ్లింది. ఇంటిలో సోంత పని చేసుకుంటున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు లోపలికి చోరబడ్డారు. తరువాత రివాల్వర్ తో ఆమె మీద కాల్పులు జరిపారు.

కాల్పులు జరిపిన నిందితులు అక్కడి నుండి బైక్ లో పరారైనారు. బుల్లెట్ లు దూసుకు వెళ్లడంతో ఆమె అక్కడే మరణించింది. హత్యకు గురైన మహిళ బావ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
దినేష్ అనే వ్యక్తి మరొ ఇద్దరితో కలిసి వచ్చి రివాల్వర్ తో కాల్చి హత్య చేశాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెలుగు చూసింది. అయితే హత్యకు కచ్చితమైన కారణాలు తెలియడం లేదని కేసు దర్యాప్తులో ఉందని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications