లంచం అడిగితే చెంప పగలకొట్టింది(వీడియో)
ముంబై: లంచం అడిగిన ఓ అధికారికి ఓ మహిళ చెంప దెబ్బతో సరైన సమాధానం చెప్పింది. ఈ ఘటన మహారాష్ట్రలోని ఉల్లాస్‌గనర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రియా గుప్తా అనే ఎన్సీపీ కార్యకర్త తన కుటుంబసభ్యుడికి సంబంధించిన ఉద్యోగ పదోన్నతి విషయంపై మాట్లాడేందుకు మంగళవారం మున్సిపల్ కార్యాలయానికి వెళ్లారు.
అయితే.. అందుకు లంచం ఇవ్వాల్సిందిగా మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ యువరాజ్ బదానే సదరు మహిళను కోరారు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ అతని చెంప పగలకొట్టింది. ఈ దృశ్యమంతా మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సీసీటీవీ కెమేరాల్లో రికార్డు అయ్యింది.
అనంతరం మహిళ పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఆ అధికారిపై ఫిర్యాదు చేసింది. సదరు అధికారి కూడా ఆ మహిళపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరి ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.












Click it and Unblock the Notifications