వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోడలిపై మామ రేప్: భర్త పట్టుకోగా రేపిస్టును చంపిన భార్య

By Pratap
|
Google Oneindia TeluguNews

లక్నో: తనపై వరుసగా రెండు రోజులు అత్యాచారం చేసిన మామను కోడలు కర్రతో కొట్టి చంపింది. అతన్ని భర్త గట్టిగా పట్టుకోగా, ఆమె కర్రతో మోదింది. దీంతో అతను మరణించాడు. ఆ తర్వాత ఇద్దరు కూడా పోలీసులకు లొంగిపోయరు.

శనివారం అర్థరాత్రి భార్యాభర్తలు అతన్ని కొట్టి చంపారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధోతండా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకంది. మృతుడి పెద్ద కుమారుడు సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తొలిసారి ఆ రోజు..

తొలిసారి ఆ రోజు..

మహిళను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపించారు. మామ తొలిసారి శుక్రవారం రాత్రి తనపై అత్యాచారం చేశాడని మహిళ మీడియా ప్రతినిధులకు చెప్పింది. తన భర్త పొలం పనికి వెళ్లిన సమయంలో అతను తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పింది

 తొలిసారి క్షమించా, కానీ..

తొలిసారి క్షమించా, కానీ..

అత్యాచారం చేసిన తర్వాత మామ క్షమాపణ చెప్పాడని, ఇక నుంచి బుద్ధిగా ఉంటానని చెప్పాడని, దాంతో విషయాన్ని తన భర్తకు చెప్పలేదని, ఆ తర్వాత శనివారం రాత్రి తన మామ తనపై మరోసారి అత్యాచారం చేశాడని తెలిపింది. ఆ సమయంలో తాను గదిలో పడుకోగా, తన భర్త వరండాలో పడుకున్నాడని చెప్పిది. దాంతో ప్రతీకారం తీర్చుకోవాలని అనుకున్నట్లు తెలిపింది.

నా తండ్రికి కావాల్సిందే..

నా తండ్రికి కావాల్సిందే..

తన భార్యను అత్యాచారం చేస్తుండగా తాను చూశానని, అతన్ని గట్టిగా పట్టుకున్నానని, తన భార్య కర్రతో అతన్ని కొట్టిందని, తాను చేసిన పనికి పశ్చాత్తాపపడడం లేదని, తన తండ్రి ఘోరమైన మరణానికి అర్హుడని బాధితురాలి భర్త అన్నాడు.

 నాలుగేళ్ల క్రితం భార్య ఆత్మహత్య

నాలుగేళ్ల క్రితం భార్య ఆత్మహత్య

మృతుడి భార్య అతని అనైతిక పనులను సహించలేక నాలుగేళ్ల క్రితం ఆత్మహత్య చేసుకుందని, పెద్ద కొడుకు తన భార్యను తండ్రి నుంచి రక్షించుకోవడానికి విడిగా ఇల్లు కట్టుకుని ఉంటున్నాడని స్థానికులు అంటున్నారు.

English summary
A 26-year-old woman beat her father-in-law to death with a stick after he allegedly raped her twice on two consecutive days
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X