Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

నడిరోడ్డుపై యువతి బట్టలూడదీసి, వీడియో తీశారు

శ్రీనగర్: జమ్ముకాశ్మీర్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పట్టపగలే, నడిరోడ్డుపై జనం చూస్తుండగా ఓ యువతిని వివస్త్రను చేశారు. అంతేగాక, వీడియోలు కూడా తీశారు. ఇంత దారుణం జరుగుతున్నా.. అక్కడున్న జనం చూస్తున్నారే తప్ప, వారిని అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం విచారకరం.

ఉదంపూర్ జిల్లా జగనూ ప్రాంతంలో ఐదుగురు వ్యక్తులు ఓ యువతిని వివస్త్రను చేసి వీడియో చిత్రీకరించారు. నిందితుల్లో ఓ ఆర్మీ జవాన్ కూడా ఉండటం దిగ్భ్రాంతిని కలిగించే విషయం. నిందితుల్లో ఒకడు తన మొబైల్ ఫోన్‌తో ఈ దృశ్యాన్ని వీడియో తీసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేశాడు.

Woman stripped naked in J&K, accused include Army jawan

వాట్సప్‌లోనూ ఈ వీడియోను ఉంచారు. పోలీసులు ఈ ఘటనను సుమోటాగా తీసుకుని కేసు నమోదు చేశారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టు ఉదంపూర్ పోలీస్ కమిషనర్ తెలిపారు. బాధితురాలు మోటార్ బైక్‌పై వెళ్తుండగా నిందితులు ఆపి అసభ్యంగా ప్రవర్తించినట్టు చెప్పారు.

ఆమె ప్రతిఘటించడంతో బంధించి వివస్త్రను చేశారు. ఈ దుశ్చర్యను అక్కడున్న జనం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు, పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు కూడా ప్రయత్నించకపోవడం దారుణమైన విషయం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+