వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దుస్తులిప్పేసి మహిళా టీచర్‌ను కొట్టారు, జరిమానా

By Pratap
|
Google Oneindia TeluguNews

Woman stripped in public, asked to pay Rs 1 lakh fine
రాయపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని జస్పూర్ జిల్లా పథాల్గావ్‌లో ఓ టీచర్‌ను బట్టలిప్పేసి నడివీధిలో కొట్టారు. పైగా లక్ష రూపాయల జరిమానాతో పాటు గ్రామ బహిష్కరణ విధించారు. ఈ సంఘటన ఏప్రిల్ 19వ తేదీన జరిగింది. నిందితుల పేర్లు చెబుతూ మహిళా టీచర్ ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. సవివరమైన ఫిర్యాదు కోసం పోలీసులు వేచి చూస్తున్నామని అంటున్నారు.

ఆ ఉపాధ్యాయురాలు మహిళా కమిషన్‌ను, మహిళా కమిషన్‌ను ఆశ్రయించింది. పోలీసులు చర్యలు తీసుకోకపోవడంపై ఫిర్యాదు చేసింది. అదే గ్రామానికి చెందిన ఆమె మేనల్లుడు ఓ అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణపై కూడా ఆమెను కొట్టారు.

తన మేనల్లుడు, అమ్మాయి ఒకే కులానికి చెందినవారని, వారు వివాహం చేసుకోవాలని అనుకుంటన్నారని మహిళా టీచర్ మహిళా కమిషన్‌కు తెలియజేసింది. ఏప్రిల్ 19వ తేదీన గ్రామసభ జరిగినప్పుడు ఒత్తిడికి గురైన బాలిక అతనితో సంబంధం లేదని చెప్పింది. దాంతో దానికి బాధ్యురాలిగా మహిళా టీచర్‌ను చేస్తూ సర్పంచ్ అందరి ముందు ఆమె కొట్టాలని ఆదేశించాడు.

బాలిక పరువు తీసినందుకు లక్ష రూపాయలు జరిమానా చెల్లించాలని మహిళా టీచర్‌ను ఆదేశించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని మహిళా టీచర్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.

English summary
A 35-year-old tribal teacher in Pathalgaon area in Jashpur district of Chhattisgarh was not only beaten and stripped in front of everyone but was also asked to pay Rs 1 lakh or face boycott from village.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X