మందు పార్టీ ఇచ్చి ప్రియుడిని లేపేసింది
న్యూఢిల్లీ: సహజీవనం చేస్తున్న ప్రియుడు పెట్టే బాధలు తట్టుకోలేక అతనికి మందు పార్టీ ఇచ్చి పీకలదాక తాగించి చంపేసిన సంఘటన దేశ రాజధాని ఢిల్లీ నగరంలో జరిగింది. హత్య చేసిన నీతూ అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
యోగేంద్ర సింగ్, నీతూ అనే ఇద్దరు గత ఆరు సంవత్సరాల నుంచి సహజీవనం చేస్తున్నారు. అయితే యోగేంద్ర సింగ్ జులాయిగా తిరుగుతూ ఒక్క రూపాయి సంపాదించేవాడు కాదు. నిత్యం మద్యం సేవించి ఇంటికి వెళ్లేవాడు
నిత్యం డబ్బులు ఇవ్వాలని నీతూను వేధించేవాడు. అతను పెట్టే బాధలు నీతూ తట్టుకోలేక పోయింది. ఎలాగైనా యోగేంద్ర సింగ్ ను అంతం చెయ్యాలని ప్లాన్ వేసింది. యేగేంద్ర సింగ్ ను హత్య చెయ్యాలని నీతూ తన బాయ్ ఫ్రెండ్ రోహిత్(18), పక్కింటి ఆశా అనే యువతిని కోరింది.

అందుకు వారు సహకరిస్తామని నీతూకు హామి ఇచ్చారు. మంగళవారం రాత్రి మద్యం సేవించి ఇంటికి వెళ్లిన యోగేంద్ర సింగ్ షాక్ కు గురైనాడు. ఇంటిలో ఫుల్ బాటిల్ మందు సీసా చూసి సంతోషం పట్టలేక నీతూను పట్టుకుని కౌగిలించుకున్నాడు.
ముందు సీసా తీసి పీకలదాక తాగేసి కుప్పకూలిపోయాడు. తరువాత నీతూ, రోహిత్, ఆశా కలిసి యోగేంద్ర సింగ్ గొంతు నులిమి హత్య చేశారు. బుధవారం వేకువ జామున మృతదేహాన్ని కారులో తీసుకుని ఢిల్లీ ఔటర్ రింగ్ రోడ్డులోని ఓ గ్రామం దగ్గర ఉన్న డీడీఏ ప్లాట్స్ దగ్గరకు వెళ్లారు.
మృతదేహాన్ని నిర్జనప్రదేశంలో విసిరివేశారు. పోలీసులు గుర్తు పట్టకుండా ముఖం మీద బండరాళ్లు వేసి పచ్చడి చేశారు. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్యకు గురైయ్యింది యోగేంద్ర సింగ్ అని గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
గత ఆరు సంవత్సరాల నుంచి నీతూ అనే మహిళతో యోగేంద్ర సింగ్ సహజీవనం చేస్తున్నాడని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు. పోలీసులు నీతూను అదుపులోకి తీసుకుని బెండ్ తియ్యడంతో అసలు విషయం వెలుగు చూసింది.
యోగేంద్ర సింగ్ ను ఎలా హత్య చేశాము అంటూ నీతూ కళ్లకు కట్టినట్లు పోలీసులకు చెప్పింది. ఈ కేసులో నీతూతో సహ హత్యకు సహకరించిన ఇద్దరిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications