యువతి షర్ట్ విప్పేసి, దాడి చేసే యత్నం, ఫిర్యాదుచేసిన స్టూడెంట్..
సమాజంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. రోజు జరిగే ఘటనలు వారి భద్రత ఎలా ఉందనే అంశానికి అద్దం పడుతున్నాయి. స్కూళ్లు, కాలేజీలు, పనిచేసే చోట, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో కూడా మహిళలకు సరైన భద్రత ఉండటం లేదు. కొందరు కీచకులు మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ దాడులకు తెగబడుతున్నారు.

విద్యార్థినికి వేధింపులు
ముంబై సమీపంలోని మలాడ్‌కి చెందిన 20 ఏళ్ల యువతి రోజు కాలేజీకి వెళుతుంది. ఎప్పటిలాగానే సోమవారం కూడా రైలులో బయల్దేరింది. కానీ ఆమెకు ఓ మత్య్సకారుడి నుంచి వేధింపులు ఎదరవుతాయని ఊహించలేదు. సోమవారం తాను వెళ్తున్న రైలు నుంచి కాందివాలి రైల్వేస్టేషన్ వద్ద దిగేందుకు ప్రయత్నించారు. అయితే అందులో ఉన్న జ్యోతి శర్మ అనే మత్య్సకారుడు (39) కూడా దిగడానికి ట్రై చేయడం వివాదానికి కారణమైంది.

ఆలస్యంగా వెలుగులోకి
సోమవారం ఉదయం 8 గంటల సమయంలో కాందివాలి స్టేషన్‌లో దిగేందుకు విద్యార్థిని ప్రయత్నించారు. ఆ సమయంలో జ్యోతి శర్మ కూడా దిగేందుకు ప్రయత్నించారు. ఇద్దరూ ఓకేసారి దిగడంతో, తాకడంతో వారి మధ్య గొడవ జరిగింది. జ్యోతి శర్మను విద్యార్థిని కోపంతో తిట్టింది. దీంతో ఆగ్రహం చెందిన అతడు విద్యార్థిని షర్ట్ విప్పేయబోయాడు. బటన్లు విప్పి.. షర్ట్ తీసేందుకు ప్రయత్నించగా ఆమె షర్ట్ లేకుండా కనిపించిన పరిస్థితి ఏర్పడింది.

పరుగుతీసిన విద్యార్థిని
భయపడ్డ విద్యార్థిని పరుగుతీసింది. కాపాడాలంటూ రైల్వేస్టేషన్‌లో రన్ తీసింది. ఆమె వెంట అతడు కూడా పరుగెత్తాడు. తనను తిట్టిందనే కారణంతో దాడిచేసేందుకు ప్రయత్నించాడు. ఈ మేరకు యువతి బోరివాలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నిందితుడిని జ్యోతి శర్మ అని గుర్తించి అరెస్ట్ చేశారు. అతనిపై 354, 323, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు.

కఠినంగా శిక్షించండి
విద్యార్థినితో మత్స్యకారుడు జ్యోతి శర్మ ప్రవర్తనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే మరికొందరు కూడా విద్యార్థులపై దాడులకు తెగబడే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.
-
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..! -
బంగారం ధరలు చేయి దాటుతున్నాయ్- ఉగాది తర్వాత -
ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
బడ్జెట్ లో ఉద్యోగులు - మహిళలకు కొత్త వరాలు - పెన్షన్, 'కళ్యాణ లక్ష్మీ' పెంపు ఇలా..!! -
కేబినెట్ లోకి విజయశాంతి, పీసీసీ చీఫ్ మార్పు - ఆ ఇద్దరూ ఔట్..కొత్తగా..!! -
బెంగళూరులో రెండో భారీ ఎయిర్ పోర్ట్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
భారీగా పెరిగిన డీజిల్ ధరలు, తగ్గుతున్న నిల్వలు- కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications