ఎస్సెమ్మెస్ చూపించలేదని బంగ్లాపైనుండి భార్య తోసివేత

Woman thrown from bungalow's terrace by husband for not showing SMS
ఇండోర్: ఫోన్‌కు వచ్చిన ఎస్సెమ్మెస్ చూపించనందుకు ఓ భర్త తన భార్యను కొత్తగా కట్టిన బంగ్లా టెర్రాస్ పైనుండి తోసివేసిన సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఇండోర్‌లో ఆదివారం చోటు చేసుకుంది. ప్రస్తుతం భార్య చావుబతుకుల మధ్య కొట్టుకుంటోంది.

ఇండోర్ నగరంలోని లాసూడియా ప్రాంతంలోని శ్రీనికేతన్ బంగ్లాలోకి నాలుగు రోజుల క్రితమే ఆనంద్ శర్మ, దీప్‌మాలా శర్మ(30) దంపతులు షిఫ్టయ్యారు. ఆదివారం ఉదయం భర్త ఆనంద్ శర్మ టీ తీసుకురమ్మని భార్యను టెర్రస్ పైకి పిలిచాడు. కొద్దిసేపు వారిద్దరి మధ్య అక్కడ వాగ్యుద్ధం జరిగింది.

కోపం పట్టలేని ఆనంద్ శర్మ భార్యను అక్కడి నుంచి కిందికి తోసేశాడు. దీంతో, దీప్‌మాలా శర్మ తలకు, ఇతర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి.

దీనిపై కేసు నమోదు చేసుకున్న లాసూడియా పోలీసులు ఆనంద్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు గల కారణాలను పోలీసులు వివరిస్తూ.. గత కొంతకాలంగా ఆమె తన సెల్‌ఫోన్లోని టెక్ట్స్ సందేశాలను భర్తకు చూపేందుకు నిరాకరిస్తుండడమే ఘటనకు కారణమని తెలిపారు.

ప్రేమను నిరూపించుకునేందుకు...

తన ప్రేమను నిరూపించుకునేందుకు ఓ యువతి భవంతి పైనుండి దూకింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో సోనాక్షీ గౌతమ్ అనే అమ్మాయి మరో కులానికి చెందిన అబ్బాయితో ప్రేమలో పడింది. వీరి ప్రేమ బంధాన్ని అమ్మాయి తల్లిదండ్రులు తీవ్రంగా వ్యతిరేకించారు.

మరోవైపు ప్రియుడు కూడా అనుమానించసాగాడు. తన పట్ల ప్రేమను నిరూపించుకోవాలని సోనాక్షిని కోరాడు. దీంతో ఆమె ఏమీ ఆలోచించకుండా ఓ బిల్డింగ్ మూడో అంతస్తు నుంచి దూకేసింది. అయితే, అంతెత్తునుంచి దూకినా ఆశ్చర్యకరంగా ఆమెకు ప్రాణహాని జరగలేదు. గాయాలపాలైన ఆమెను ఆసుపత్రికి తరలించగా.. కోలుకుంటోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+