Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఘోరం: లైంగిక దాడిని అడ్డుకున్నందుకు మహిళను రైలు నుంచి తోసేశారు, మృతి

చండీగఢ్: హర్యానాలోని ఫతేబాద్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తనపై వేధింపులకు ప్రయత్నించిన వ్యక్తితో పోరాడినందుకు 30 ఏళ్ల మహిళను నడుస్తున్న రైలు నుంచి బయటకు తోసివేశారు. దీంతో ఆమె మరణించింది. కాగా, ఆమె తన తొమ్మిదేళ్ల కొడుకుతో కలిసి రైలులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫతేబాద్‌లోని తోహానా పట్టణంలో రైలు స్టేషన్‌లోకి ప్రవేశించిన సమయంలో మహిళ భర్త ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు. ఆ చిన్నారి తన తండ్రికి జరిగిన విషయాన్ని చెప్పిందని పోలీసులు తెలిపారు.

Woman thrown off running train for resisting molester, dies; Child Found Alone In Coach.

ముగ్గురు ప్రయాణికులు మినహా కోచ్ మొత్తం ఖాళీగా ఉందని ఫతేబాద్ పోలీసు చీఫ్ అస్తా మోడీ మీడియాతో అన్నారు.

ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళను చూసిన నిందితులు ఆమెపై అఘాయిత్యానికి ప్రయత్నించగా.. ఆమె ఎదురు తిరిగింది. చిన్నారి చెప్పిన విషయాలను ఉటంకిస్తూ ఆ వ్యక్తి తన తల్లిని రైలు నుంచి బయటకు నెట్టి తానూ దూకాడని పోలీసులు తెలిపారు.

"నా కొడుకు ఏడుస్తున్నాడు. అతను నా దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాడు. ఒక వ్యక్తి తల్లిని రైలు తలుపు నుంచి తోసేశాడని చెప్పాడు' అని బాధితురాలి భర్త తెలిపారు. "తాను 20 కి.మీ దూరంలో ఉన్నపుడు మొబైల్‌కి కాల్ చేసింది. స్టేషన్‌కి వచ్చి పికప్ చేయమని కోరింది. ఇప్పుడు ఆమె లేరు" అని భర్త కన్నీరుమున్నీరుగా విలపించాడు.

దూకడం వల్ల గాయపడిన సందీప్ (27) అనే నిందితుడిని పోలీసులు గుర్తించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. అతడిని అరెస్టు చేస్తామని ఓ పోలీసు అధికారి తెలిపారు. ప్రభుత్వ రైల్వే పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఆమె గత కొన్ని రోజులుగా రోహ్‌తక్‌లో ఉంటున్నారని, గురువారం రాత్రి 145 కిలోమీటర్ల దూరంలోని తోహానాకు తిరిగి వెళ్లేందుకు రైలులో వెళ్లినట్లు మహిళ భర్త తెలిపారు.

పోలీసులు, మహిళ కుటుంబ సభ్యులు ఆమె మృతదేహం కోసం రైల్వే ట్రాక్ వెంబడి అర్ధరాత్రి వరకు పెద్ద ఎత్తున వెతికారు. చీకటిగా ఉండడం, ట్రాక్‌ వెంబడి పొడవాటి పొదలు ఉండడంతో వెతకడం కష్టంగా మారింది. ఈ ఉదయం వారు మృతదేహాన్ని కనుగొన్నారు.

రాత్రి వేళల్లో రైల్వే పోలీసులు కోచ్‌లపై నిఘా ఉంచాల్సిన అవసరం ఉండగా, భద్రతా లోపం జరిగిందా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తోహానా వద్ద రైల్వే పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్ జగదీష్ తెలిపారు. ఎవరెవరు డ్యూటీలో ఉన్నారో చూసి చర్యలు తీసుకుంటామన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+