పోలీసుల దాష్టీకం: మహిళను జీపుపై కట్టేసి తిప్పారు, వేగానికి కిందపడటంతో తీవ్రగాయాలు

అమృత్‌సర్: పంజాబ్ పోలీసులు మరోసారి దాష్టీకానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తిని అరెస్ట్ చేయబోతే అతని భార్య అడ్డుపడిందంటూ.. ఆమెను తమ జీపుపై కట్టేసి ఊరంతా ఊరేగించారు. ఇలా ఊరేగిస్తున్న సమయంలో ఆ మహిళ ప్రమాదవశాత్తు జీపు పైనుంచి పడటంతో తీవ్రగాయాలయ్యాయి.

వివరాల్లోకి వెళితే.. ఓ ఆస్తి వివాదం కేసులో బాధిత మహిళ మామను విచారించడానికి చావిందా దేవి ప్రాంతంలోని వాళ్ల ఇంటికి వెళ్లారు పోలీసులు. అతను ఇంట్లో లేకపోవడంతో సదరు మహిళ భర్తను తీసుకెళ్లడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఆమె అడ్డుకుంది.

Woman tied on top of police vehicle, paraded in Amritsar

ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన పంజాబ్ క్రైం బ్రాంచ్ పోలీసులు ఆమెను బలవంతంగా తీసుకెళ్లి జీపు టాప్‌పై కట్టేసి ఊరంతా తిప్పారు. దీనికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

కాగా, జీపుపై కట్టేసి ఊరంతా తిప్పుతున్న సమయంలో జీపు వేగానికి సదరు మహిళ కిందపడిపోయింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఇంత జరిగినా ఆ పోలీసులపై చర్యలు తీసుకోకపోవడంపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేం పాలన అంటూ అధికార కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. గతంలో కూడా పంజాబ్ పోలీసులు ఓ మహిళను నడిరోడ్డుపై లాఠీలతో చితకబదాడం విమర్శలకు తావిచ్చింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+