నాలుగు సార్లు కరోనా టీకా.. అయినా వదలని వైరస్.. మహిళకు పాజిటివ్..
దేశంలో కరోనా విలయతాడవం చేస్తోంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సైతం తన ప్రతాపాన్ని చూపిస్తోంది. కరోనా టీకా తీసుకున్నప్పటీకీ వదల బొమ్మాలి.. వదలా అంటుంది. ఒకటి కాదు రెండు కాదు , ఏకంగా నాలుగు సార్లు వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ వైరస్ వెంటాడుతుంది. తాజాగా ఇండోర్‌లో ఓ మహిళకు కరోనా సోకింది.

నాలుగు డోసులు తీసుకున్న కరోనా వైరస్
మధ్రప్రదేశ్‌లోని ఇండోర్ నుంచి దుబాయ్ వెళ్లేందుకు 30 ఏండ్ల మహిళ్ల ఇండోర్ ఎయిర్ పోర్టుకు వచ్చింది. కరోనా నిబంధనల ప్రకారం ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించారు అధికారులు. టెస్ట్‌ల్లో మహిళకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్పించారు. అయితే ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ నాలుగు డోసులు తీసుకున్నదని అధికారులు పేర్కొన్నారు. అయినా మహిళకు కరోనా సోకిందని చెప్పారు. సదరు మహిళ 12 రోజుల క్రితం ఇండోర్‌కు వచ్చి తిరిగి దుబాయ్‌కి వెళ్తుండగా వైరస్ పాజిటివ్ గా నమోదైంది..

ఆస్పత్రిలో చికిత్స
ఇండోర్ ఎయిర్ పోర్టులో ప్రతి ప్రయాణీకునికి పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా ఇండోర్-దుబాయ్ విమానంలో ప్రయాణించే వారికి వారానికొకసారి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తారు. నిబంధన ప్రకారం 89 మంది పరీక్షలు నిర్వహించారు. వారిలో మహిళకు కరోనా పాజటివ్‌గా తేలిందని ఇండోర్ ఆరోగ్య శాఖ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రియాంక కౌరవ్ తెలిపారు. ఆమె జనవరి నుండి ఆగస్టు వరకు సినోఫార్మ్, ఫైజర్ యొక్క యాంటీ కోవిడ్ వ్యాక్సిన్‌ల రెండు డోసులను తీసుకుంది. మహిళను దుబాయ్ వెళ్లే విమానం ఎక్కకుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు.

సాదారణ లక్షణాలే..
ఇప్పటి వరకు సెప్టెంబర్ 15న ఇండోర్-దుబాయ్ విమానంలో 26 ఏళ్ల వ్యక్తిని, అక్టోబర్ 13న 68 ఏళ్ల మహిళను, అక్టోబర్ 27న 72 ఏళ్ల మరో మహిళకు కరోనా సోకింది. వారిని విమానం ఎక్కకుండా ఆపారు. తాజాగా మరో మహిళకు పరీక్షల్లో పాజిటివ్ తేలింది. దీంతో ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు . ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. సాదారణ లక్షణాలే ఉన్నట్లు చెప్పారు. వారం క్రితం ఆ మహిళకు జలుబు, దగ్గు సమస్య ఉందని వైద్యులు వెల్లడించారు.












Click it and Unblock the Notifications