మద్యం తాగే మహిళల సంఖ్య పెరిగిన రాష్ట్రాల్లో 'ఆంధ్రప్రదేశ్'..
న్యూఢిల్లీ/విజయవాడ: దేశంలో మద్యం సేవిస్తున్న మహిళల సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగినట్లుగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్‌ఎఫ్‌హెచ్ఎస్) నివేదికలు చెబుతున్నాయి.
ప్రధానంగా ఢిల్లీలో ఆల్కహాల్ తీసుకుంటున్న మహిళ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు రిపోర్టులో వెల్లడైంది. ఢిల్లీ తర్వాత గోవా, కేరళ, ఆంధ్రప్రదేశ్, మిజోరం, మణిపూర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మద్యం సేవిస్తున్న మహిళ సంఖ్య పెరిగినట్లు సర్వేలో తేలింది.

ఢిల్లీలో 2005-06, 2016-17 మధ్య కాలంలో మద్యం సేవించే పురుషుల సంఖ్య తగ్గగా.. మహిళల సంఖ్య పెరగడం గమనార్హం. 0.4శాతం నుంచి 0.7శాతం వరకు వారి సంఖ్య పెరిగింది. మద్యం సేవించే మహిళలంతా ఢిల్లీలో శక్తి అనే గ్రూపుగాను ఏర్పడ్డారు. ఈ గ్రూపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న మహిళా ఆల్కాహాలిక్‌ల కన్నా పెద్దది.












Click it and Unblock the Notifications