భార్యపై కదులుతున్న కారులో భర్త, స్నేహితులు రేప్, క్యాండిల్‌తో కాల్చారు

ఈస్ట్ ఢిల్లీ సమీపంలోని జాతీయ రహదారి పక్కన అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను పోలీసులు ఆసుపత్రికి చేర్చారు. మంగళవారం సృహలోకి వచ్చిన ఆమె పోలీసులకు విషయం తెలిపింది. పెళ్లయిన ఏడాదికే గొడవలు రావడంతో ఆమె భర్త నుంచి వేరుగా ఉంటోంది.
మహిళ పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త, ఇద్దరు మిత్రులు ఆమెను కిడ్నాప్ చేశారు. అనంతరం కదులుతున్న కారులో అత్యాచారం చేశారు. ఆమెను తీవ్రంగా బాధించారు. అనంతరం కారులో నుండి రోడ్డు పైకి తోసేశారు. దీంతో ఆమె స్పృహ కోల్పోయింది.
కారులో ఆమె పైన అత్యాచారానికి పాల్పడిన వారు ఆమె పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. ఆమె ప్రయివేట్ పార్ట్స్‌లలో క్యాండిల్స్‌తో కాల్చారు. కారులో నుండి బయటకు పడేయడంతో స్పృహ కోల్పోయింది. అయితే, ఆమె కాసేపటికి ఎలాగో తన బంధువులకు సమాచారం ఇచ్చింది. అనంతరం మళ్లీ పడిపోయింది. బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆమెను రక్షించారు.
కాగా, తన వయస్సు 22 అని ఆమె చెబుతోంది. అయితే, ఆమె పెళ్లి సర్టిఫికేట్ ఆధారంగా 26గా ఉంది. వారి పెళ్లి జరిగి ఏడాది అవుతోంది. నెల రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. మరోవైపు బాధితురాలు తన భర్త నుండి డైవోర్స్ కోరుతోంది.












Click it and Unblock the Notifications