చేయి చేసుకొని..: మొబైల్ షాప్‌లో మహిళ, ఇద్దరి కూతుళ్ల విధ్వంసం (వీడియో)
ఢిల్లీలోని ఓ మొబైల్ దుకాణంలో ముగ్గురు మహిళలు హల్‌చల్ చేశారు. తమ మొబైల్ బాగు చేయలేదని ఆరోపిస్తూ దుకాణంలో టేబుల్ కిందపడేసి, చిందరవందర చేశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ మొబైల్ దుకాణంలో ముగ్గురు మహిళలు హల్‌చల్ చేశారు. తమ మొబైల్ బాగు చేయలేదని ఆరోపిస్తూ దుకాణంలో టేబుల్ కిందపడేసి, చిందరవందర చేశారు.
ఓ మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు దుకాణంలో హంగామా సృష్టించారు. ఈ సంఘటన ఢిల్లీలోని రాజౌరీ ప్రాంతంలో చోటు చేసుకుంది. వారి చర్య అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయింది.
#WATCH: Three women created ruckus, vandalised a mobile phone store in Rajouri Garden, Delhi (20/02/17). pic.twitter.com/6ytJ3QzGnS
— ANI (@ANI_news) February 22, 2017
అందులో ముగ్గురు మహిళలు కూడా షో రూంలోని ప్రాపర్టీని ధ్వంసం చేస్తున్నట్లుగా ఉంది. అంతేకాదు, షోరూంలో ఉన్న వారి పైన చేయి చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఓ మహిళ ఇటీవలే ఈ షో రూం నుంచి ఓ మొబైల్ కొనుగోలు చేసింది. కానీ ఆ మెబైల్ సరిగా పని చేయలేదు. దీంతో ఆమె షో రూంకు వచ్చింది. మరో మొబైల్ మార్చి ఇవ్వాలని చెప్పింది.
అయితే, షో రూం వాళ్లు మొబైల్ మార్చి ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు షో రూంలో హంగామా సృష్టించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. పోలీసులు వెళ్లేసరికి ఆమె ఇంట్లో లేదు.












Click it and Unblock the Notifications