ఫుల్ గా తాగింది, ఊగింది: నడి రోడ్డు మీద అడ్డంగా
కోవై (తమిళనాడు): తమిళనాడులో మద్య నిషేధం విధించాలని పలు మహిళా సంఘాలు ఆందోళన చేస్తుంటే ఒక మహిళ మాత్రం పట్టపగలు ఫుల్ గా మద్యం సేవించి నడి రోడ్డు మీద అందరికి చుక్కలు చూపించింది. తరువాత కైపు తలకెక్కడంతో నడి రోడ్డు మీద అడ్డంగా నిద్రపోయింది.
తమిళనాడులోని కోవై నగరంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కోవై నగరంలోని పెరియనాయకన్ పాళయం లో పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. అదే రోడ్డులో డీఎస్పీ కార్యాలయం, పోలీస్ స్టేషన్ లు ఉన్నాయి.
మంగళవారం 45 సంవత్సరాల వయస్సు ఉన్న మహిళ పీకలదాక మద్యం సేవించి నడిరోడ్డు మీదకు వచ్చింది. వాహన చోదకులు, పాదచారులకు అడ్డంగా వెళ్లింది. రోడ్డు మీద ఊగిపోతూ నడిచింది. రోడ్డు మధ్యలో పూనకం వచ్చినట్లు ఊగిపోయింది.

తరువాత కిక్ తలకెక్కడంతో మెయిన్ రోడ్డు మీద పడిపోయి అడ్డంగా నిద్రపోయింది. అటు వైపు వెళుతున్న వారు ఆమెను కనీసం పక్కకు జరపలేదు. ఎవరిదారి వారు చూసుకున్నారు. సాయంత్రం కావడం, మహిళకు కిక్ తగ్గిపోవడంతో ఆమె పైకి లేచింది.
చట్టూ జనం చూస్తూ వెళుతుండడం కనపడటంతో అవమానానికి గురైయ్యింది. పైకి లేచి చిన్నగా అక్కడి నుండి వెళ్లిపోయింది. స్థానికులు సైతం తమకు సమాచారం ఇవ్వలేదని, తమకు ఏ విధమైన సంబంధం లేదని స్థానిక పోలీసులు అంటున్నారు.












Click it and Unblock the Notifications