పేదరికం: పిల్లలకు విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య
బెంగళూరు: పేదరికం వెక్కిరించడంతో జీవితంపై విరక్తి చెందిన మహిళ తన ఇద్దరు బిడ్డలకు విషం పెట్టి హత్య చేసి ఆమె ఆత్మహత్య చేసుకున్న సంఘటన బెంగళూరు నగరంలో జరిగింది. పాదరాయణపురలోని అరాఫత్ నగరలో నివాసం ఉంటున్న రిజ్వానా (40), రియాజ్ (5), హజీరా (3) అనే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు.
తమిళనాడులోని వేలూరుకు చెందిన జహీర్, రిజ్వానా దంపతులు బెంగళూరు చేరుకుని పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. జహీర్ టైలర్ పని చేసేవాడు. సౌదీ అరేబియాలో టైలర్ పని చేస్తే ఎక్కువ జీతం వస్తుందని 8 నెలల క్రితం జహీర్ అక్కడికి వెళ్లాడు.
రిజ్వానా పిల్లలతో కలిసి ఇక్కడే నివాసం ఉంటున్నది. సౌదీ అరేబియా నుంచి భర్త జహీర్ పంపించే డబ్బుతో బ్రతకడం రిజ్వానాకు భారం అయ్యింది. అప్పు చేసి కుమారుడిని స్కూల్ లో చేర్పించింది. చుట్టు పక్కల వారు ఇచ్చే అన్నం పిల్లలకు పెట్టి బ్రతుకుతున్నది.

పేదరికంతో బ్రతకలేమని రిజ్వానా నిర్ణయించుకునింది. పిల్లలకు విషం తాగించి ఆమె తాగి ఆత్మహత్య చేసుకునింది. శుక్రవారం సాయంత్రం రిజ్వానా సోదరుడు ఆమె ఇంటి దగ్గరకు వెళ్లాడు. ఎంత సేపు తలుపు కొట్టినా ఆమె స్పందించకపోవడంతో కిటికిలో చూశాడు.
ముగ్గురు నేల మీద చలనం లేకుండ పడి ఉన్న విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చి చూడగా విషయం వెలుగు చూసింది. ఇంటిలో విషం కలిపి ఉన్న మూడు గ్లాస్ లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టీలో విషం కలిపి పిల్లలకు ఇచ్చిన తరువాత ఆమె తాగి ఆత్మహత్య చేసుకునిందని శనివారం జగజ్జీవన్ రామ్ నగర పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications