అక్కడ జిలెటిన్ స్టిక్స్ కుక్కి ప్రియురాలిని పేల్చేశాడు

కర్ణాటకలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళను ఆమె ప్రియుడు దారుణంగా హతమార్చాడు. మరొకరిని పెళ్లి చేసుకోవడం ఇష్టలేకపోవడమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ హత్యకు పాల్పడిన యువకుడిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హతురాలి పేరు రక్షిత. వయస్సు 20 సంవత్సరాలు. మైసూర్ జిల్లా హుణసూరు తాలూకా పరిధిలోని గెరసనహళ్లి ఆమె స్వగ్రామం. జిల్లాలోని సాలిగ్రామ తాలూకా బేర్యాలో ఓ లాడ్జిలో నిర్జీవంగా కనిపించింది. తల ఛిద్రమైన స్థితిలో మృతదేహాన్ని పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఆమెతో పాటు లాడ్జిలో దిగిన సిద్ధరాజు అనే యువకుడు ఆమెను హత్యచేసినట్లుగా నిర్ధారించారు. అతన్ని అరెస్ట్ చేశారు.

Women incident in Mysuru of Karnataka

ఎనిమిది నెలల కిందట రక్షితకు కేరళలోని కాసర్ గోడ్ జిల్లాకు చెందిన యువకుడితో పెళ్లయింది. అంతకుముందు ఆమె పిరియపట్టణ తాలూకాలోని బెళకెరె గ్రామానికి చెందిన సిద్ధరాజును ప్రేమించింది. అతనితో పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. కేరళకు చెందిన యువకుడికి ఇచ్చి పెళ్లిచేశారు.

ఆ తరువాత కూడా రక్షిత.. సిద్ధరాజుతో అతనితో శారీరక సంబంధాన్ని కొనసాగించింది. ఆమెను వదిలించుకోవాలని సిద్ధరాజు ప్లాన్ వేశాడు. రెండు రోజుల కిందట ఆమెను పిరియాపట్టణకు పిలిపించాడు. అనంతరం ఇద్దరూ కలిసి కప్పాడి క్షేత్రానికి వెళ్లాలని నిర్ణయించారు. బేర్యాలో లాడ్జిలో దిగారు.

అక్కడే రక్షితను హత్య చేశాడు సిద్ధరాజు. తన వెంట తెచ్చుకున్న జిలెటిన్ స్టిక్స్ ను నోట్లో కుక్కి పేల్చివేశాడు. ఈ ఘటనలో ఆమె తల ఛిద్రమైంది. అక్కడికక్కడే మరణించింది. పేలుడు శబ్దం వినిపించడంతో లాడ్జి సిబ్బంది హుటాహుటిన గదికి చేరుకుని చూడగా.. రక్తపుమడుగులో రక్షిత నిర్జీవంగా కనిపించింది.

దీంతో హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సిద్ధరాజును ప్రశ్నించగా.. ఛార్జింగ్ కు పెట్టిన మొబైల్ ఫోన్ పేలిపోయిందని బుకాయించే ప్రయత్నం చేశాడు. సంఘటన స్థలంలో మొబైల్ ఫోన్ కనిపించలేదు. దాని గురించి ఆరా తీయగా.. బయటపడేశానని చెప్పాడు. ఎంత వెదికినా మొబైల్ కనిపించకపోవడంతో పోలీసులు అతన్ని తమదైన శైలిలో ప్రశ్నించడంతో నేరాన్ని అంగీకరించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+