ప్రేమ పెళ్లి: మొబైల్ వ్యసనం, భార్యను చంపిన భర్త

సైమన్ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా, భార్య క్రమంగా మొబైల్ ఫోన్‌కు బానిసగా మారింది. నిత్యం మొబైల్‌లోనే గడుపుతోందని సమాచారం. పలుమార్లు భర్త హెచ్చరించారు.
ఈ విషయమై భార్యాభర్తల మధ్య పలుమార్లు గొడవలు జరిగాయి. డ్యూటీలో ఉన్న సమయంలో ఎన్నిసార్లు ఫోన్ చేసినా, రేణుక సెల్ ఎంగేజ్‌లోనే ఉంటుండటం సైమన్‌లో అనుమానాన్ని పెంచింది. గొడవలు మరింత ముదిరాయి.
నిత్యం మొబైల్ ఫోన్ వాడటంపై భార్య భర్తకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం ప్రారంభించింది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. భార్య నిర్లక్ష్య సమాధానంతో విచక్షణ కోల్పోయిన భర్త కత్తితో ఆమె పీకను కోసేశాడు. అనంతరం రేణుకను రక్తపు మడుగులో చూసి భయంతో పరారయ్యాడు. బంధువుల ఇంటిలో తలదాచుకున్న భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications