సొంతంగా రైల్వేస్టేషన్ నిర్వహిస్తున్న మహిళలు
భారతదేశంలోనే తొలి మహిళా రైల్వే స్టేషన్... ఐక్యరాజ్య సమితి ప్రశంసలు లభించడం మహిళా సాధికారతకు నిదర్శనంగా నిలుస్తోంది. రాజస్థాన్ లోని గాంధీనగర్ లో మొట్టమొదటి మహిళా రైల్వే స్టేషన్‌ను భారతీయ రైల్వే ప్రకటించింది. నార్త్ వెస్ట్రన్ రైల్వే పరిధిలో ఇది ఉంది. జైపూర్ జిల్లాలోని గాంధీ నగర్ రైల్వే స్టేషన్‌కు భారతీయ రైల్వే అందరూ మహిళా ఉద్యోగులనే నియమించింది. పూర్తిస్థాయిలో మహిళలచే నిర్వహింపబడుతున్న మొదటి స్టేషన్ గా నిలిచింది.
రైల్వే .. అందరూ మహిళా రైల్వే ఉద్యోగులను నియమించింది. ఈ రైల్వే స్టేషన్ పూర్తిగా మహిళా ఉద్యోగులచే నిర్వహించబడుతున్న మొదటి స్టేషన్. టిక్కెట్ ను విక్రయించే వ్యక్తి నుంచి టికెట్ కలెక్టర్, స్టేషన్ మాస్టర్ తో సహా అన్ని విభాగాల్లోను మహిళా సిబ్బందే విధులు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఐక్యరాజ్యసమితి ట్విట్టర్ లో షేర్ చేసింది.
ముంబయి జోన్‌లోని మాతుంగా రైల్వే స్టేషన్‌లో మొత్తం మహిళా సిబ్బంది ఉన్నారు. దేశవ్యాప్తంగా ఉద్యోగాలు, వ్యాపార రంగాల్లో ఉన్న మహిళల శాతం దేశంలో కేవలం 27గా ఉంది. అంత తక్కు ఉన్నప్పటికీ ప్రధాన మార్గంలో ఒక రైల్వేస్టేషన్ ను ఎటువంటి అవాంతరాలు తలెత్తకుండా సమర్థవంతంగా నిర్వహించడం అందరికీ స్ఫూర్తినిస్తోంది.

గాంధీ నగర్ రైల్వే స్టేషన్‌లో మొత్తం 40 మంది మహిళా ఉద్యోగులున్నారు. ఇతర రైల్వే స్టేషన్ల కన్నా సమర్థవంతంగా పనితీరు కనపరుస్తోంది. ప్రతిరోజు ఈ మార్గంలో 50 రైళ్లు ప్రయాణిస్తాయి. గాంధీ నగర్ స్టేషన్ లో 24 రైళ్లు ఆగుతాయి. నిత్యం 7వేల మంది ప్రయాణికులు ఈ స్టేషన్ ను ఉపయోగిస్తున్నారు.
సేవలు వేగంగా అందించడం, క్యూ లైన్లు తక్కువగా ఉండటంతోపాటు సీసీటీవీ కెమెరాల నిర్వహణ, స్టేషన్ పరిశుభ్రత వంటి అంశాల్లో ఇతర స్టేషన్లకన్నా ఎంతో ముందంజలో ఉంది.మహిళా ప్రయాణికుల సౌకర్యం కోసం మహిళా పోలీస్ స్టేషన్‌ను ప్రారంభించడంతోపాటు రైల్వే స్టేషన్‌లో శానిటరీ నాప్‌కిన్ వెండింగ్ మిషన్‌ను కూడా ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications