Women Reservation Bill 2023:మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఏంటి..!
కొన్ని దశాబ్దాల పోరాటం తర్వాత తెల్ల దొరల నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించింది. దేశంలో లింగ విబేధం లేకుండా అందరికి సమాన హక్కులు కలిగి ఉండాలని, అన్ని మతాలు, వర్గాలు, సంస్కృతులు సమానంగా ఉండాలన్న ఆంక్షతో బ్రిటీషు వారిపై పోరాడి స్వాతంత్ర్యం సాధించుకున్నాం. ప్రజాస్వామ్య దేశంలో వివిధ వర్గాలకు చెందిన వారి హక్కులకు భంగం కలిగించేలా ఉండకూడదు. సమాన హక్కులు కలిగి ఉండాలంటే ఈ హక్కులను అమలు చేసే రాజ్యాంగ వేదికల్లో కూడా సమానంగా ప్రాతినిథ్యం ఉండాలి.అయితే ఇక్కడ పురుషుల ఆధిపత్యమే ఎక్కువగా కనిపించింది.మహిళల ప్రాధాన్యత తగ్గుతూ ఉండటంతో మహిళా రిజర్వేషన్ బిల్ ప్రాధాన్యత సంతరించుకుంది.
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్ర ఏంటి : భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించగానే అసమానత్వపు విత్తనాలు పుట్టుకొచ్చాయి. పురుషాధిక్యం ఎక్కువగా మారడంతో క్రమంగా మహిళలకు పలు రంగాల్లో ప్రాధాన్యత తగ్గుతూ వచ్చింది. అయితే మహిళల ప్రాతినిథ్యం ఎందుకు తగ్గుతోంది అనేదానిపై ఎక్కడా చర్చ జరగలేదు. అలా కొన్ని దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ 1971లో తొలిసారిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో మహిళల ప్రాతినిథ్యం ఎందుకు తగ్గిపోతోందో తెలుసుకునేందుకు కమిటీ వేయడం జరిగింది. అయితే ఈ కమిటీ చట్టసభల్లో రిజర్వేషన్‌ను రికమెండ్ చేయలేదు కానీ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావాలంటూ నివేదిక ఇచ్చింది.

దీంతో రాజ్యాంగంలోని 73,74వ రాజ్యాంగ సవరణలు చేసి పార్లమెంటులో పాస్ చేయడం జరిగింది. దీంతో పంచాయతీల్లో, పట్టణ స్థానిక సంస్థల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఇందుకు అదనంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించడం జరిగింది. పార్లమెంటులో తొలిసారిగా మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ప్రస్తావించింది మాత్రం 1996లో అప్పటి దేవెగౌడ ప్రభుత్వం. దీన్ని 81 రాజ్యాంగ సవరణ బిల్‌గా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అయితే లోక్‌సభ రద్దు కావడంతో ఈ బిల్ కూడా మరుగున పడింది. తిరిగి ఇదే అంశాన్ని 1998,1999,2002,2003లో తీసుకొచ్చినప్పటికీ ఫలితం ఇవ్వలేదు.
ఆ తర్వాత మహిళల రిజర్వేషన్ బిల్లుపై ఎలాంటి గట్టి చర్యలు చేపట్టలేదు.అయితే రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేయించారు. ఈ బిల్లు ప్రకారం చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ రొటేషనల్ పద్ధతిలో ఉంటుందని పొందుపర్చారు. అంతేకాదు డ్రా పద్దతిలో ఒక సీటు ప్రతి మూడు సాధారణ ఎన్నికలకు ఒకసారి మహిళలకు కేటాయిస్తామని పొందుపర్చారు. అయితే చాలా బలహీనంగా ఉన్న ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలపలేదు. ఇక అప్పటి నుంచి బిల్లు సంగతే పట్టించుకోలేదు. మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదల్ పార్టీ ఉన్నారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు సీట్లు రిజర్వ్ చేయడం న్యాయంగా లేదని వాదించాయి. తర్వాత చాలాకాలానికి కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ఎన్డీయే సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లును సెప్టెంబర్ 18 నుంచి 22 వరకు జరిగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల్లో తీసుకురావాలని భావిస్తోంది.












Click it and Unblock the Notifications