• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మ‌రోసారి తెర‌పైకి మ‌హిళా బిల్లు ..! అదికారంలోకి వ‌స్తే ఆమోదిస్తామ‌న్న రాహుల్..!!

|
  Rahul Gandhi assures Passage Of Women's Reservation Bill If Voted To Power | Oneindia Telugu

  కొచ్చి/ హైద‌రాబాద్ : ఎన్నికల హామీలు ఇవ్వ‌డంలో కాంగ్రెస్ పార్టీ అద్య‌క్ష‌డు రాహుల్ గాంధీ దూసుకుపోతున్నారు. అదికారం లోకి వ‌స్తే ఎప్ప‌టి నుంచో పార్ల‌మెంట్ లో పెండింగ్ లో ఉన్న మ‌మిళా బిల్లులు ఆమోదిస్తామ‌ని ప్ర‌క‌టించారు. కొచ్చిలో జ‌రిగిన క‌ర్య‌క‌ర్త‌ల స‌మావేశంలో రాహుల్ గాంధీ ఈ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసారు. చ‌ట్ట స‌భ‌ల్లో 33శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించే మ‌హిళా బిల్లుకు తాము క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని తెలిపారు. అదికారంలోకి రాగానే ఎనిమిదేల్లుగా పెండింగ్ లో ఉన్న మ‌హిళా బిల్లుకు మోక్షం క‌లిగిస్తామ‌ని రాహుల్ చెప్పారు.

   కొచ్చిలో కార్యకర్తలతో రాహుల్ భేటీ..! మ‌హిళా బిల్లుపై కీల‌క ప్ర‌క‌ట‌న‌..!!

  కొచ్చిలో కార్యకర్తలతో రాహుల్ భేటీ..! మ‌హిళా బిల్లుపై కీల‌క ప్ర‌క‌ట‌న‌..!!

  2019 లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదిస్తామని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్ట మొద‌ట‌ మహిళా రిజర్వేషన్‌ చట్టాన్ని తెస్తామని స్పష్టం చేశారు.మహిళల్ని నాయకత్వ స్థానాల్లో చూడాలనుకుంటున్నామని ఓ మహిళా కార్యకర్త చేసిన సూచనకు రాహుల్‌ ఈ మేరకు స్పందించారు. సామాన్య కార్యకర్తలు పార్టీ అధిష్టానంతో మాట్లాడేలా ‘శక్తి' అనే కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. కేరళలోని కొచ్చిలో జరిగిన బూత్‌ కమిటీల సమావేశంలో 50,000 మంది కార్యకర్తలతో రాహుల్‌ సమావేశమయ్యారు. ఈ కార్యక్రమానికి హాజరైనవారిలో సగం మంది మహిళలే ఉండ‌డం విశేషం..!

  దేశమంతటా రుణమాఫీ చేస్తాం..! మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌న్న రాహుల్..!!

  దేశమంతటా రుణమాఫీ చేస్తాం..! మోదీ దేశ ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌న్న రాహుల్..!!

  ఈ సందర్భంగా ప్రధాని మోదీ 2014 ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై మాట్లాడుతూ.. ‘ఒకదాని తర్వాత మరో అబద్ధం చెబుతూ ప్రధాని మోదీ దేశానికి చెందిన ఐదేళ్ల విలువైన సమయాన్ని వృథా చేశారు. ప్రతీఏటా 2 కోట్ల కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి కేవలం తన 15 మంది స్నేహితులకు కనీస ఆదాయ భద్రతను కల్పించారు. అదే సమయంలో దేశం లోని వేలాది మంది యువతకు మొండిచెయ్యి చూపారు.

  కేర‌ళ సాంప్ర‌దాయాల‌ను కాంగ్రెస్ గౌర‌విస్తుంది..! కాంగ్రెస్ చేత‌ల పార్టీ అన్న రాహుల్..!!

  కేర‌ళ సాంప్ర‌దాయాల‌ను కాంగ్రెస్ గౌర‌విస్తుంది..! కాంగ్రెస్ చేత‌ల పార్టీ అన్న రాహుల్..!!

  మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌ రాష్ట్రాల్లో అధికారంలోకి రాగానే రైతు రుణాలను కాంగ్రెస్‌ మాఫీ చేసింది. అలాగే కేంద్రం లో అధికారంలోకి వస్తే దేశంలోని రైతుల రుణాలన్నింటిని మాఫీ చేస్తాం' అని అన్నారు. బీజేపీ, సీపీఎం శైలిపై స్పందిస్తూ.. ‘బీజేపీ, సీపీఎం తీరు ఒక్కటే. వీరి పాలనలో సొంత పార్టీ కార్యకర్తలే ప్రభుత్వ పథకాలతో లబ్ధిపొందారు. బీజేపీ, సీపీఎం రాష్ట్రంలో హింసను రెచ్చగొడుతున్నాయి. మహిళల హక్కులను, కేరళ సంప్రదాయం, ఆచారాలను కాంగ్రెస్‌ గౌరవిస్తుందని అని రాహుల్‌ అన్నారు.

  గోవా సీఎం పరీకర్‌తో రాహుల్‌ భేటీ..!కేరళలో సీపీఎం,బీజేపీ హింసకు పాల్పడుతున్నాయన్న రాహుల్..!!

  గోవా సీఎం పరీకర్‌తో రాహుల్‌ భేటీ..!కేరళలో సీపీఎం,బీజేపీ హింసకు పాల్పడుతున్నాయన్న రాహుల్..!!

  కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ గోవా సీఎం మనోహర్‌ పరీకర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాహుల్‌..పరీకర్‌ ఆరోగ్యానికి సంబంధించి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. పరీకర్ లివ‌ర్ సంబంధిత వ్యాధితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. రఫేల్‌ ఒప్పందానికి సంబంధించి రహస్య పత్రాలు పరీకర్‌ దగ్గర ఉన్నందునే ఆయన సీఎం పదవిలో ఉన్నారని రాహుల్‌ ఆరోపించిన ఒక రోజు తర్వాత ఆయన పరీకర్‌తో భేటీ అవడం గమనార్హం. ‘రాహుల్‌ మర్యాద పూర్వకంగా కలిశారని విపక్ష నేత చంద్రకాంత్‌ చెప్పారు.

  English summary
  When it came into force, it was announced that the pending women's bills in Parliament would be accepted. Rahul Gandhi made these sensational comments at the meeting of the workers at Kochi.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X