రేప్ విక్టిమ్స్‌ను కూడా ఉరి తీయాలి: అబూ అజ్మీ
ముంబై: అత్యాచారానికి పాల్పడిన కుర్రాళ్లకు ఉరిశిక్ష విధించడం సరి కాదని సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ వ్యాఖ్యానించి వివాదాన్ని సృష్టిస్తే అదే పార్టీకి చెందిన అబూ అజ్మీ మరో వ్యాఖ్యతో వివాదం సృష్టించాడు. వివాహం జరగకముందు సెక్స్ అనుభవించే అమ్మాయిలను ఉరి తీయాలని ఆయన అన్నారు. దాంతో ఆగకుండా ఆత్యాచార బాధితులను కూడా ఉరి తీయాలని ఆయన వ్యాఖ్యానించారు.
అత్యాచారంపై ములాయం సింగ్ చేసిన వ్యాఖ్యపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఆయన ఆ విధంగా స్పందించారు. మిడ్డే వార్తాకథనం ప్రకారం - అత్యాచారానికి ఉరిశిక్ష విధించాలని ఇస్లాం చెబుతుందని, కానీ ఈ విషయంలో మహిళలకు ఏమీ జరగడం లేదని, మహిళలు తప్పు చేసినా అటువంటిది లేదని ఆయన అన్నారు.

ఇరువురి అంగీకారం మేరకు శృంగారం నెరిపితే ఫరవాలేదని, ఆ వ్యక్తి ఫిర్యాదు చేస్తే సమస్య ఎదరవుతోందని, ఇటువంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయని, తమను తాకినా అమ్మాయిలు ఫిర్యాదు చేస్తున్నారని, తాకకపోయినా ఫిర్యాదు చేస్తున్నారని, ఇది సమస్యగా తయారైందని, పురుషుడి గౌరవం నాశననమవుతోందని ఆయన అన్నారు.
ఇస్లాం ప్రకారం అంగీకారంతో జరిగినా, అనంగీకారంతో జరిగిన అత్యాచారానికి ఉరిశిక్ష విధించాలని ఆయన అన్నారు. దానికి పరిష్కారం ఒక్కటేనని, ఏ మహిళ అయినా వివాహమైనా, కాకపోయినా పురుషుడితో అంగీకారంతో గానీ అనంగీకారంతో గానీ వెళ్తే ఉరి తీయాలని అన్నారు. ఇద్దరినీ ఉరి తీయాలని అన్నారు. మహిళలు అంగీకరించి వెళ్తే ఆమోదించడానికి లేదని అన్నారు.












Click it and Unblock the Notifications