షాక్: అలా అయితే మేం ఓటు వేయం.. పేరంట్స్, టీచర్ వార్నింగ్.. ఎక్కడ అంటే
పంజాబ్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలను చేస్తున్నారు నేతలు. కానీ కొన్ని వర్గాల నుంచి నిరసన తప్పడం లేదు. అయితే కరోనా పేరు చెప్పి.. వ్యాపార వాణిజ్య సముదాయ పనులు కొనసాగుతున్నాయి. కానీ స్కూల్స్ మాత్రం తెరవడం లేదు. దీంతో పేరంట్స్, టీచర్స్ ఫైర్ అవుతున్నారు. తమ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీశారు.
కరోనా కేసులు పెరగడంతో రాష్ట్రంలో ఫిబ్రవరి 8వ తేదీ వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. దీంతో స్కూల్ అడ్మినిస్ట్రేషన్, టీచర్స్, పేరంట్స్ కలిసి శనివారం ఆందోళన నిర్వహించాయి. పంజాబ్ అన్ ఎయిడెడ్ స్కూల్ అసోసియేషన్ ధర్నా నిర్వహించింది. బర్నాల జిల్లాలో 100 మంది ప్రజలు ఆందోళన చేపట్టారు. 10 స్కూళ్లకు చెందిన సిబ్బంది పాల్గొన్నారు.

స్కూళ్లు తెరవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గత 9 నెలలుగా స్కూల్స్ క్లోజ్ చేశారని పేర్కొన్నారు. ఆన్ లైన్ క్లాసులు.. మొబైల్‌లో వినడం వల్ల పిల్లల కంటిపై ప్రభావం చూపుతాయని వివించారు. తమ కుమారుడు కూడా సరిగా చదవడం లేదని ఓ పేరంట్ తెలిపారు. ఎన్నికల ర్యాలీ నిర్వహించేందుకు లేని ఇబ్బంది.. స్కూల్ తెరిస్తేనే వస్తోందా అని అడిగారు. తమకు ఆన్ లైన్ క్లాసులు నిర్వహించేందుకు ప్రభుత్వం కూడా తగిన ఏర్పాట్లు చేయలేదని ఓ టీచర్ అంటున్నారు. 8వ తేదీ వరకు చూస్తామని... పాఠశాలలు తెరవాల్సిందేనని స్పష్టంచేశారు.
ఇటు ఫిబ్రవరి 14న ఉత్తరాఖండ్, గోవాలోని అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి జనవరి 21న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. జనవరి 28తో నామినేషన్లు ముగిసాయి. ఫిబ్రవరి 14న పోలింగ్ జరుగుతోంది. ఫలితాలను మాత్రం మార్చి 10న వెల్లడిస్తారు. పంజాబ్ పోలింగ్ ఫిబ్రవరి 20వ తేదీ ఆదివారం జరగనుంది. తొలుత 14వ తేదీ నిర్వహిస్తామని షెడ్యూల్‌లో ఈసీ తెలిపింది. మిగతా పక్షాల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. దీంతో 20వ తేదీన నిర్వహిస్తామని ఈసీ తెలిపింది.












Click it and Unblock the Notifications