వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అద్భుతం: 42 బోగీల రైలు.. ఆమెపై నుంచి వెళ్లినా.. ప్రాణాలతో..

పట్టాలు దాటుతున్న సమయంలో సడన్ గా రైలు వచ్చేయడంతో ఓ మహిళ తెలివిగా పట్టాల మధ్యలోనే కదలకుండా పడుకుని ప్రాణాలు దక్కించుకుంది. నమ్మకపోతే వీడియో చూడండి.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సందడిగా ఉన్న రైల్వే స్టేషన్. పొడవాటి గూడ్సు రైలు ఒకటి రయ్యిన దూసుకుపోయింది. అది అటు వెళ్లిందో లేదో పట్టాల మధ్య నుంచి ఓ మహిళ పైకి లేచింది. మెల్లగా ప్లాట్ ఫామ్ పైకి ఎక్కింది.

ఈ దృశ్యం చూసి అక్కడున్న ప్రయాణికులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. మీద నుంచి రైలు పోయాక ఆమె బతికుండడం.. అసలు ఇదెలా జరిగింది? అంటూ కళ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయారు.

ఎప్పుడు, ఎక్కడ జరిగిందో పూర్తి వివరాలు తెలియకపోయినా.. ఈ ఘటన మన దేశంలోనే ఏదో రైల్వేస్టేషన్ లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియోను ఎవరో యూట్యూబ్ లోకి అప్ లోడ్ చేశారు. ఫిబ్రవరి 21న యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. వీడియోలో మొదట రైలు వెళుతున్న దృశ్యం మాత్రమే కనిపిస్తుంది.

రైలు పూర్తిగా ప్లాట్ ఫామ్ దాటి వెళ్లిపోయాక అదే పట్టాలపై నుంచి ఈ మహిళ లేచి రావడం కనిపిస్తుంది. ఇది గమనించిన ప్లాట్ ఫామ్ పైనున్న ప్రయాణికుల్లో కొంతమంది ఆమెకు సాయం చేసేందుకు రావడం కనిపిస్తుంది.

పట్టాలు దాటుతున్న సమయంలో రైలు వచ్చేయడంతో ఆ మహిళ పట్టాల మధ్యలోనే కదలకుండా పడుకుని ఉండిపోవడం వల్ల ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన వారంతా ఆపద సమయంలో ఆమె ఉపాయంతో వ్యవహరించిన తీరు, ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తున్నారు.

English summary
If this woman isn't the luckiest person alive, then we don't know who is. A video with over five million views shows a woman miraculously surviving a train run-over. At first, it simply looks like a video of a train passing by. But as soon as the 42 bogeys disappear from the frame, a woman - who had been lying on the tracks all this while - gets up and is ushered away by other passengers on the platform.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X