మోదీ హవా తగ్గిందా-కాంగ్రెస్ భర్తీ చేస్తుందా : ప్రాంతీయ పార్టీలతో అసలు పోటీ- మూడ్ ఆఫ్ ది నేషన్..!!

తాజాగా ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే విడుదల చేసిన మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో అనేక ఆసక్తి కర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది జనవరిలో ఒక సర్వే చేసిన ఈ సంస్థ..ఇప్పుడు తాజాగా మరో సారి సర్వే నిర్వహించింది. మొత్తం..19 రాష్ట్రాల్లోని 115 పార్లమెంటరీ మరియు 230 అసెంబ్లీ నియోజకవర్గాలలో జూలై 10 మరియు జూలై 20, 2021 మధ్య సర్వే జరిగింది. ఈ సర్వేలో కోవిడ్ -19 తో పాటుగా దేశ ఆర్దిక వ్యవస్థ-ప్రధాని మోదీ ఆధ్వర్యంలోనే ఎన్డీఏ పని తీరు పైన ప్రధానంగా అభిప్రాయ సేకరణ చేసారు. ఈ సర్వేలో గుర్తించిన అనేక అంశాలు అటు బీజేపీ..ఇటు కాంగ్రెస్ రెండు పార్టీలకు ఆందోళన కలిగించేలా ఉన్నాయి. ఇదే సమయంలో ప్రాంతీయ పార్టీలు..వాటి నేతలు బలం పెంచుకుంటున్న విషయం తేటతెల్లం చేసింది.

 మోడీ పాపులారిటీ రేటింగ్స్‌లో తగ్గుదల- భర్తీ చేసుకోలేని కాంగ్రెస్..

మోడీ పాపులారిటీ రేటింగ్స్‌లో తగ్గుదల- భర్తీ చేసుకోలేని కాంగ్రెస్..

బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ కు సంబంధించి నరేంద్ర మోదీ గతం కంటే 14 శాతం మద్దతు తగ్గింది. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరియు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కాదు 11% మద్దతుతో నంబర్ టూ ఛాయిస్ గా ఉన్నారు. అయితే, వ్యక్తిగతంగా మోదీకి పాపులారిటీ తగ్గినా..పార్టీ పరంగా బీజేపీ ముందుజలో ఉండటం కమల నాధులకు ఊరటనిచ్చే అంశం. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ..పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వంటి ప్రాంతీయ పార్టీలు రాజకీయంగా లాభపడుతున్నాయి. కాంగ్రెస్ తో సహా ప్రాంతీయ పార్టీల నుంచి ప్రధాని రేసులో ఉన్న వారి కంటే బీజేపీ నుంచే ప్రధాని అభ్యర్ధికి మద్దతు ఎక్కువగా ఈ సర్వేలో కనిపించింది.

ద్రవ్యోల్బణం మోడీ 2.O అతిపెద్ద వైఫల్యంగా ..

ద్రవ్యోల్బణం మోడీ 2.O అతిపెద్ద వైఫల్యంగా ..

సర్వేలో భాగంగా దాదాపు 49 శాతం మంది ప్రధాని మోదీ కోవిడ్ -19 పరిస్థితుల నిర్వహణలో అత్యుత్తమ-ఉత్తమంగా పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం మేనేజ్ మెంట్ లో ప్రధాని మోదీ 2019 జనవరిలో 73 శాతం మద్దతుగా నిలవగా..ఇప్పుడు అది భారీగా తగ్గిపోయింది. ఇంధన ధరల పెంపు వలన లీటరు పెట్రోల్ రూ .100 దాటింది .ఇటీవల అధిక ద్రవ్యోల్బణం కారణంగా ధరల పెరుగుదల కారణంగా దేశం ఎదుర్కొంటున్న 2 వ అతిపెద్ద సమస్యగా పేర్కొన్నారు. దీనిని మోడీ ప్రభుత్వం అతిపెద్ద వైఫల్యం గా సర్వేలో తేల్చారు. ఇంకా, 60% మంది జనవరి 2021 లో 35% తో పోలిస్తే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం తగినంతగా చేయలేదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. పెగాసస్ పెద్ద సమస్య కాదు, సామాన్యుడిని ప్రభావితం చేసే సమస్యలపై కాంగ్రెస్ దృష్టి పెట్టాలనే అభిప్రాయం వ్యక్తమైంది. అధిక ద్రవ్యోల్బణం గతంలో అనేక ప్రభుత్వాల పతనానికి దారితీసిందని బిజెపి మర్చిపోకూడదు. కనుక ఇది వెంటనే చర్య తీసుకోవలసిన అవసరం ఉంది.

గాంధీ కుటుంబం లేకుంటేనే కాంగ్రెస్ కు భవిష్యత్..

గాంధీ కుటుంబం లేకుంటేనే కాంగ్రెస్ కు భవిష్యత్..


ఈ సర్వేలో మరో ఆసక్తి కరం అంశం పైన భిన్నాభిప్రాయలు వ్యక్తమయ్యాయి. సర్వే లో పాల్గొన్న దాదాపు సగం మంది గాంధీ కుటుంబ సభ్యులు నిష్క్రమిస్తేనే కాంగ్రెస్‌కు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 45% మంది (-7%) గాంధీలు లేకుంటే కాంగ్రెస్ బాగుంటుందని భావిస్తున్నారు. 46% (+11%) లేకపోతే అనిపిస్తుంది. జనవరి 2021 నుండి గాంధీలకు మద్దతు పెరగడం మరో కీలక అంశం. పంజాబ్ సంక్షోభాన్ని విజయవంతంగా నిర్వహించడం, అదే విధంగా పార్లమెంట్ సెషన్‌లో రాహుల్ యొక్క కార్యాచరణ ఆదరణ పెరగటానికి కారణంగా చెప్పుకోవచ్చు. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు సగం మంది గాంధీ నిష్క్రమించాలని సూచిస్తూనే..గాంధీ కుటుంబం వారు కొంత ఆత్మ పరిశోధన చేసుకోవాలని సూచిస్తున్నారు.

వచ్చే 6 నెలల్లో 1/3 వ వంతు ఆర్థిక వ్యవస్థ క్షీణ దిశగా..

వచ్చే 6 నెలల్లో 1/3 వ వంతు ఆర్థిక వ్యవస్థ క్షీణ దిశగా..

వచ్చే ఆరు నెలల్లో ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తుందని 33% (జనవరి 2021 కంటే రెట్టింపు) భావిస్తున్నారు. 21% (జనవరి 2021 సగం) ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుందని భావిస్తే 43% (+7%) అలాగే ఉంటుందని భావిస్తున్నారు. 2016 నుంచి కేంద్ర ఆర్దిక వ్యవస్థను సమర్ధవంతంగా నిర్వహించట లేదనే అభిప్రాయం వ్యక్త మైంది. మోడీ ప్రభుత్వ ఆర్థిక విధానాల వల్ల పెద్ద వ్యాపారాలు మాత్రమే ప్రయోజనం పొందాయని భావిస్తున్నారు. మోడీ హయాంలో 28% మంది మాత్రమే తమ ఆర్థిక స్థితి మెరుగుపడిందని భావిస్తున్నారు. ఈ సంఖ్య ఆగస్టు 2019 నుండి జనవరి 2021 వరకు 45% -50% పరిధిలో ఉండేది. కరోనా మహమ్మారి సమస్య వల్ల ఏర్పడిన ఆర్థిక పతనం ఈ తగ్గుదలలో పాత్ర పోషిస్తుంది.

 ప్రాంతీయ పార్టీల నుండి టాప్ 5 సీఎంలు అందరూ..

ప్రాంతీయ పార్టీల నుండి టాప్ 5 సీఎంలు అందరూ..

రాష్ట్రాల నుండి పాపులర్ ముఖ్యమంత్రులను రేట్ చేయాలని సర్వేలో కోరారు. తమిళనాడుకు చెందిన ఎంకే స్టాలిన్, ఒడిశాకు చెందిన నవీన్ పట్నాయక్, కేరళకు చెందిన పినయారి విజయన్, మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రే మరియు పశ్చిమ బెంగాల్‌కు చెందిన మమతా బెనర్జీ తమ రాష్ట్రాల్లో అత్యధిక పాజిటివ్ రేటింగ్‌లను అందుకున్నారు. తొలి స్థానంలో తమిళనాడు సీఎం స్టాలిన్ ఉన్నారు. జాతీయ పార్టీల కంటే ప్రాంతీయ పార్టీల పరిపాలన పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. మోస్ట్ పాపులర్ సీఎంల కేటగిరీలో టాప్ 11 లో, ఇద్దరు బీజేపీ (హిమంత బిశ్వ శర్మ మరియు యోగి ఆదిత్యనాథ్) మరియు ఇద్దరు కాంగ్రెస్ ముఖ్యమంత్రులు (అశోక్ గెహ్లాట్ మరియు భూపేష్ బాఘేల్) ఉన్నారు. యోగి 29%పాజిటివ్ రేటింగ్‌ని నివేదించారు. ఇది వచ్చే ఏడాది జరిగే ఎన్నికల పైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

Recommended Video

    Talibans Clarity on Kashmir. But pak may influence them in long-term process.
     బీజేపీ- కాంగ్రెస్ గుర్తించాల్సినవి...

    బీజేపీ- కాంగ్రెస్ గుర్తించాల్సినవి...


    ఈ సర్వేలో కొన్ని లోపాలున్నా.. రెండు జాతీయ పార్టీలు బీజేపీ-కాంగ్రెస్ ఖచ్చితంగా గుర్తించాల్సిన అంశాలు ఉన్నాయి. అందులో విస్మరించలేని విషయాలు గుర్తించాలి.

    బిజెపి: పార్టీకి ఆర్థిక వ్యవస్థ అతిపెద్ద సవాలుగా మిగిలిపోయింది. మందగమనానికి కరోనా మహమ్మారి పాక్షికంగా కారణమైనప్పటికీ, ప్రజలు ద్రవ్యోల్బణం ప్రభావం నుంచి బయట పడేసేలా ప్రభుత్వం వైపు చూస్తున్నారు. పేద - మధ్యతరగతి వారికి ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

    కాంగ్రెస్: పార్టీ తన నాయకత్వ సమస్యను త్వరలో పరిష్కరించుకోవాలి. ఇది ప్రజలకు సంబంధించిన నిజమైన సమస్యలను లేవనెత్తాలి. ప్రాంతీయ పార్టీలు పుంజుకుంటున్నాయి . జాతీయ స్థాయిలో బిజెపికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్‌ను గుర్తించాలంటే..సంస్థాగతంగా మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని సర్వేలో తేలిన అంశం.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+