మా రాష్ట్రానికి సల్మాన్ అయితే బెటర్: సీఎం మెహబుబా ముఫ్తీ

Subscribe to Oneindia Telugu

ముంబై: ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ను జమ్మూకాశ్మీర్‌ పర్యాటక అభివృద్ధికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఆహ్వానించేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. ప్రకృతి అందాలను వీక్షించాలనుకునే పర్యాటకులకు కాశ్మీర్‌ ఎంతో సురక్షితమైందని ఆమె వ్యాఖ్యానించారు.

నటుడు, దర్శకుడు ఇమ్రాన్‌ ఖాన్‌ తీసిన 'సర్గోషియాన్‌' చిత్ర ట్రైలర్‌ను ముంబైలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ముఫ్తీ మాట్లాడుతూ.. ఈ ఏడాది ముంబై వాసులందరూ కాశ్మీర్‌ను వీక్షించాలని ముఫ్తీ విజ్ఞప్తి చేశారు.

‘Would like Salman Khan to promote tourism in Kashmir’: Chief minister Mehbooba Mufti

ఏ బాలీవుడ్‌ నటుడిని బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంచుకుంటారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. పర్యటక రంగ ప్రమోషన్‌ కోసం సల్మాన్‌ ఖాన్‌కు అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతానని ముఫ్తీ పేర్కొన్నారు.

శ్రీనగర్‌లో వసంత కాలం సందర్భంగా ఆసియాలోనే అతిపెద్ద తులిప్‌ గార్డెన్‌లో ఫెస్టివల్‌ను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ముఫ్తీ తెలిపారు. తమ రాష్ట్రాన్ని సందర్శించాలని మెహబూబా ముఫ్తీ ప్రతీ ఒక్కర్నీ ఆహ్వానించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Jammu and Kashmir chief minister Mehbooba Mufti on Friday said that the state is safe for tourists to visit since unrest that began last year has subsided.
Please Wait while comments are loading...