ఆల్‌పార్టీ మీటింగ్‌కు ఎందుకు రాలేదంటే .. మాయావతి చెప్పిన కారణమిదీ ?

న్యూఢిల్లీ : దేశం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు అన్ని పార్టీల నేతలను ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానించారు. ఈ సమావేశానికి బీఎస్పీ చీఫ్ మాయావతి కూడా హాజరుకాలేదు. పైగా తాను ఎందుకు రాలేనో సవివరంగా ఎక్స్‌ప్లేన్ చేశారు మాయావతి. తాను సమావేశానికి వస్తే సమస్యలను వదిలి చర్చ పక్కదారి పడుతుందని పేర్కొన్నారు.

జమిలీ ఎన్నికల అంశం కూడా ...
వాస్తవానికి మోడీ కీలక అంశాలతోపాటు ఓకే దేశం, ఓకే ఎన్నికలు నిర్వహణపై చర్చిద్దామని ఆహ్వానించారు. ఈ ఏడాది జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి, అలాగే 2022లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నందున కీలక అంశాలపై ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోవాలని అఖిలపక్ష సమావేశానికి పిలిచారు. కానీ కొందరు నేతలు మాత్రం సమావేశానికి హాజరుకాలేదు. తాను ఎందుకు హాజరుకాలేదో మాయావతి వివరణ ఇచ్చారు. ఈవీఎంల చర్చ జరుగుతుందని .. దీంతో దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్య పేదరికంపై సవ్యంగా డిస్కషన్ జరుగదని పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ స్థానంలో ఈవీఎం తీసుకురావడం చారిత్రక తప్పిదమని మాయావతి అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు అని పేర్కొన్నారు.

‘Would’ve attended if it was on EVMs’: Mayawati to skip PM meet

Recommended Video

    నీతి ఆయోగ్ కు హాజరు కానున్న కేసీఆర్..

    సాఫీగా ..
    ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రక్రియకు ఎన్నడూ ఆటంకాలు కలుగొద్దు. అలా జరిగితే విలువలకు తిలోదకాలు ఇచ్చినట్టు అవుతుందన్నారు మాయావతి. అలాగే ఓకే దేశం ఓకే ఎన్నిక తో కూడా అంతగా ప్రయోజనం ఉండదని అభిప్రాయపడ్డారు. దీంతో సమస్యలు పక్కదారి పట్టే అవకాశం ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదరికం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓకే దేశం ఓకే ఎన్నిక అనేది బీజేపీ లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో అని .. దానిని అమలు చేయాలని ఎలా చూస్తారాని మాయావతి ప్రశ్నించారు. దేశంలో జమిలీ ఎన్నికల నిర్వహణపై గతేడాది న్యాయశాఖ సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఓకే దేశం ఓకే ఎన్నిక అనే అంశం తెరపైకి వచ్చింది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+